Breaking: ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కొత్త ధరలివే..!

మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు జగన్ సర్కార్ ఆదివారం ప్రకటించింది.

Breaking: ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కొత్త ధరలివే..!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 8:06 AM

మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు జగన్ సర్కార్ ఆదివారం ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం.. గతంలో రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.20 పెంచారు. అలాగే హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెంచారు. ఇక రూ.120-150 ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.40 పెంచారు. ఇక మినీ బీర్‌పై రూ.20, ఫుల్ బీర్‌పై రూ.30 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మూడోదశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరవచ్చని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ఏపీలో లిక్కర్‌ షాపులు తెరుచుకోనుండగా.. తెలంగాణలో మాత్రం వైన్‌ షాపుల ఓపెనింగ్‌కు ఎక్సైజ్‌ శాఖ నో చెప్పింది.

ఇక ఏపీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మాస్క్‌ లేకపోతే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ పేర్కొన్నారు.

Read This Story Also: రోహిత్‌ ఎదుగుదలకు ధోనినే కారణం: గంభీర్