Mechanic Rocky OTT: ఓటీటీలోకి వచ్చేసిన మెకానిక్ రాకీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Dec 13, 2024 | 8:04 AM

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరోవైపు సరికొత్త కంటెంట్ వెబ్ సిరీస్ సైతం సినీప్రియులను ఆకట్టుకుంటాయి. తాజాగా మరో తెలుగు కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.. ?

Mechanic Rocky OTT: ఓటీటీలోకి వచ్చేసిన మెకానిక్ రాకీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Mechanic Rocky
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో మెప్పించాడు. ఈ చిత్రాలకు అంతగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఇటీవలే మెకానిక్ రాకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. నవంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో మరోసారి విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా గత అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సినిమా విషయానికి వస్తే.. రాకీ (విశ్వక్) మెకానిక్ గ్యారేజ్ తోపాటు డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటాడు. వారసత్వంగా వచ్చిన ఆ గ్యారేజీలోనే తన తండ్రితో కలిసి పనిచేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రాకీ తండ్రి చనిపోతాడు. అప్పుడే మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి) మెకానిక్ రాకీ దగ్గర డ్రైవింగ్ స్కూల్లో చేరుతుంది. రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియ.

ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలయ్యే లోపే రాకీ తన డ్రైవింగ్ స్కూల్ వదిలేయాల్సి వస్తుంది. మధ్యలోనే రంకిరెడ్డి అనే ఓ కబ్జాదారుడు (సునీల్).. ఆ మెకానిక్ షెడ్డుని కబ్జా చేయబోతాడు. మరోవైపు తన తండ్రి పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని.. ఆ డబ్బును రంకిరెడ్డికి ఇచ్చేసి ఆ కబ్జా నుంచి తప్పించుకోవచ్చని రాకీకి చెబుతుంది. దీంతో రాకీ మాయ చెప్పిన సలహా పాటిస్తాడు. కానీ అప్పుడే రాకీ జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. చివరకు ఏం జరుగుతుందనేది సినిమా.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.