కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటేస్ట్ మూవీ విడుదల 2. డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది వచ్చిన విడుదల సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మరోసారి అడియన్స్, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. కానీ మరోసారి తనదైన అద్భుతమైన నటనతో మెప్పించాడు మక్కల్ సెల్వన్. ఈ సినిమాలో మంజు వారియర్, భవానీ స్రీ, కిశోర్, గౌతమ్ మీనన్, సూరి, రాజీవ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ మూవీలో పెరుమాల్ వాతియార్ పాత్రలో విజయ్ సేతుపతి, కానిస్టేబుల్ కుమరేశన్ పాత్రలో సూరి మెప్పించారు.
ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.50.36 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ అంతగా కలెక్షన్స్ రాలేదు. అంచనాలకు తగ్గ రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
విడుదల 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 17న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈసినిమా అందుబాటులోకి రానుందని టాక్.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.