Saindhav OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘సైంధవ్’.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..
హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్‌తో విడుదలకు ముందే అంచనాలు క్రియేట్ చేసుకుంది ఈ మూవీ.. కంటెంట్.. డైరెక్షన్ పరంగా మెప్పించినప్పటికీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది. సైంధవ్ సినిమాకు ముందు రెండు చిత్రాలు.. ఆ తర్వాత జనవరి 14న నా సామిరంగ రిలీజ్ కావడంతో కలెక్షన్స్ విషయంలో ఈ సినిమాకు దెబ్బ పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ‘సైంధవ్’. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. జనవరి 13న విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు విడుదలై హిట్ టాక్ అందుకున్నా.. ఈ సినిమా సైతం హిట్ టాక్ అందుకుంది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకబడింది. హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్‌తో విడుదలకు ముందే అంచనాలు క్రియేట్ చేసుకుంది ఈ మూవీ.. కంటెంట్.. డైరెక్షన్ పరంగా మెప్పించినప్పటికీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది. సైంధవ్ సినిమాకు ముందు రెండు చిత్రాలు.. ఆ తర్వాత జనవరి 14న నా సామిరంగ రిలీజ్ కావడంతో కలెక్షన్స్ విషయంలో ఈ సినిమాకు దెబ్బ పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. సంక్రాంతి పండక్కి విడుదలైన నాలుగు సినిమాల్లో అతి త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సినిమా ఇదే.
థియేటర్లలో పాజిటివ్ రివ్యూ అందుకున్న ఈ సినిమా… ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3 నుంచి అంటే శనివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యొచ్చు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, బేబీ సారా కీలకపాత్రలలో నటించారు. కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ తండ్రి చేసే పోరాటమే ‘సైంధవ్’.
కథ విషయానికి వస్తే..
ఈ సినిమాలో హీరో కూతురికి ఒక అరుదైన జబ్బు వస్తుంది. దానిని నయం చేయడానికి ఒక్క ఇంజెక్షన్ చాలు. కానీ దాని విలువ రూ. 17 కోట్లు. దీంతో పాపని ఎలా బతికించాలా అని బాధపడుతుంటాడు. అయితే ఈ జబ్బుతో తన పాప మాత్రమే కాదు.. ఇంకా ఎంతో మంది చిన్నారులు బాధపడుతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఓ టెర్రరిస్ట్ ముఠాతో హీరోకు గొడు జరుగుతుంది. వారంతా హీరోని చూసి భయపడుతుంటారు. అయితే హీరోను చూసి ఆ ముఠా ఎందుకు భయపడుతుంది ?.. అసలు హీరో గతంలో ఏం చేసేవాడు ?.. చివరికి తన పాపను ఎలా బతికించుకుంటాడు ? అనేది సైంధవ్ కథ. ఈ సినిమాను ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే చూసేయ్యొచ్చు.
Telugu film #Saindhav will premiere on Amazon Prime on February 3rd.
Telugu. Tamil. pic.twitter.com/IQxP2qINTc
— Streaming Updates (@OTTSandeep) January 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




