Veera Simha Reddy: అన్‏స్టాపబుల్ వేదికపై వీరసింహా రెడ్డి టీమ్ సందడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Jan 09, 2023 | 6:49 PM

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలోకి వీరసింహా రెడ్డి టీమ్ రాబోతుంది. డైరెక్టర్ గోపిచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్ సందడి చేయనున్నారు.

Veera Simha Reddy: అన్‏స్టాపబుల్ వేదికపై వీరసింహా రెడ్డి టీమ్ సందడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Balakrishna
Follow us on

సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద వీరసింహారెడ్డిగా సందడి చేయబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. మరోవైపు జై బాలయ్య.. సుగుణ సుందరి సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చిత్రప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. ఇప్పుడు బాలయ్య హోస్ట్ గా చేస్తో్న్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2షోలోకి రాబోతున్నారట.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తోన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. అలాగే ప్రొడ్యూసర్స్ రాబోతున్నారట. ఈ సంక్రాంతి బిగ్గీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఇటీవలే ఈ షోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మ్యాచో స్టార్ గోపిచంద్ మలినేని సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరి ఎపిసోడ్‏కు రికార్డ్స్ సైతం బద్దలయ్యాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పవన్, బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ జనవరి 20న లేదా 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.