టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేష్ జగన్నాథమ్ మొదటి సారి మెగా ఫోన్ పట్టి ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. హీరో వరుణ్ సందేశ్ స్వయంగా నిర్మించిన నింద సినిమాలో రాజన్న ఫేమ్ అనీ, క్యూ మధు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 21న థియేటర్లలో రిలీజైన నింద సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఎక్కువగా ప్రమోషన్లు లేకపోవడంతో లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. అయితే నింద సినిమాలోని కథ, కథనాలతో పాటు వరుణ్ సందేశ్ యాక్టింగ్, కథలోని ట్విస్ట్‌లు బాగున్నాయంటూ రివ్యూలు వినిపించాయి. ముఖ్యంగా వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించాడంటూ ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన నింద మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారంలో నింద మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
నింద సినిమా కథ విషయానికి వస్తే.. మంజు (క్యూ మధు) అనే యువతిని రేప్ చేసి చంపేశాడని కాండ్రకోటకు చెందిన బాలరాజును (ఛత్రపతి శేఖర్) పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసుల విచారణలో బాలరాజే ఈ హత్య చేశాడని ఆధారాలు దొరుకుతాయి. జడ్జి సత్యానంద్ (తనికెళ్లభరణి) అతనికి ఉరిశిక్ష విధిస్తాడు. అయితే బాలరాజు నేరం చేయలేదని సత్యానంద్ నమ్ముతాడు. అతడిని ఎలాగైనా నిర్ధోషిగా నిరూపించమని హ్యూమన్ రైట్స్ కమీషన్‌లో పనిచేసే కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ను కోరుతాడు. దీంతో ఈ కేసును రీ ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు వివేక్. మరి అతని విచారణలో ఏం తేలింది? నిజంగా బాలరాజే హంతకుడా?ఈ హత్యకు బాలరాజు కూతురు సుధాకు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? హంతకులను పట్టుకోవడానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్నదే నింద సినిమా కథ. కాగా ఈ సినిమాల అనీ క్యూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర పోషించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.