AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable 2 Episode 2 Promo: అన్‏స్టాపబుల్ వేదికపై విశ్వక్ సేన్, డిజే టిల్లు రచ్చ.. హీరోలకు చెమటలు పట్టించిన బాలయ్య.. ప్రోమో అదిరిపోయిందిగా..

సెకండ్ ఎపిసోడ్ అతిథులుగా యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ విచ్చేశారు. వీరిద్దరితో కలిసి అన్‏స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు.

Unstoppable 2 Episode 2 Promo: అన్‏స్టాపబుల్ వేదికపై విశ్వక్ సేన్, డిజే టిల్లు రచ్చ.. హీరోలకు చెమటలు పట్టించిన బాలయ్య.. ప్రోమో అదిరిపోయిందిగా..
Unstoppable Season 2 Promo
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2022 | 12:26 PM

Share

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారమైన అన్‏స్టాపబుల్ సీజన్ 1 టాక్ షో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిన విషయమే. నందమూరి బాలకృష్ణ హోస్ట్‏గా వ్యవహరించిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తనదైన స్టైల్లో అతిథుల నుంచి సమాధానాలు రాబట్టడమే కాకుండా.. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేశారు బాలయ్య. ఆయన హోస్టింగ్ స్టైల్ కు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. దీంతో సీజన్ 1కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే జోరులో సీజన్ 2 స్టార్ట్ చేసింది ఆహా. ముందు నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అతిథులుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. తన బావ, అల్లుడికి తనదైన శైలిలో చలాకీగా ప్రశ్నలు వేస్తూ.. వారి నుంచి సమాధానాలు రాబడుతూ.. వారిద్దరిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యారు బాలయ్య. ఈ ఎపిసోడ్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా అన్‏స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా.

సెకండ్ ఎపిసోడ్ అతిథులుగా యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ విచ్చేశారు. వీరిద్దరితో కలిసి అన్‏స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు. ఎంట్రీ ఇవ్వడంతోనే సిద్దు హెయిర్ స్టైల్ పై పంచ్ వేశారు బాలకృష్ణ. తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ బాలయ్య అరవగా.. అది మెస్సీ లుక్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు సిద్దూ.. దీంతో అలా తాను మెస్సీ లుక్ లో కనిపించిన చిత్రాలన్ని మెస్సీ అయినంటూ పంచ్ వేశారు బాలయ్య. అలాగే మీ క్రష్ ఎవరని అడగ్గా.. రష్మిక మందన్నా అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. ఆ తర్వాత వీరిద్దరి నుంచి ఫ్లర్టింగ్ ఎలా చేయాలంటూ టిప్స్ అడిగి తెలుసుకున్నారు.

అంతేకాకుండా షో మధ్యలోనే త్రివిక్రమ్ కు కాల్ చేసి అన్‏స్టాపబుల్ షోకు రావాలని కోరారు. ఎన్బీకే అంటే త్రిఇన్ వన్ అని బాలకృష్ణ చెప్పగా.. ఇప్పుడే చెమటలు పట్టిస్తున్నారంటూ విశ్వక్ సేన్ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది. వీరికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే అక్టోబర్ 21వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.