AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna – Unstoppable 2 : బాలయ్య క్రష్ ఎవరో తెలుసా ?.. స్వయంగా చెప్పేసిన నందమూరి హీరో..

ఎవరయ్యా సిద్ధూ బాబుకు తల దువ్వకుండా పంపించారు..హే మేకప్ మేన్, హెయిర్ స్టైలిస్ట్ అంటూ బాలయ్య పిలుస్తుండగా.. ఇది మెస్సీ లుక్ సర్ అని చెప్పాడు సిద్దూ. దీంతో అలా తాను మెస్సీ లుక్ లో కనిపించిన సినిమాలన్ని మెస్సయ్యాయి అంటూ నవ్వులు పూయించారు.

Balakrishna - Unstoppable 2 : బాలయ్య క్రష్ ఎవరో తెలుసా ?.. స్వయంగా చెప్పేసిన నందమూరి హీరో..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2022 | 12:57 PM

Share

అన్‏స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. నారా చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్ కలిసి సందడి చేసిన తర్వాత తదుపరి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్‏స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. యంగ్ హీరోస్ సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అన్‏స్టాపబుల్ వేదికపై బాలయ్యతో కలిసి సందడి చేశారు. తనదైన పంచులతో.. ప్రశ్నలకు ఈ ఇద్దరు హీరోలను బాలయ్య ఓ ఆటాడుకున్నట్లుగా తెలుస్తోంది. వేదికపైకి రావడంతోనే సిద్దూకు పంచ్ వేశాడు బాలయ్య. ఎవరయ్యా సిద్ధూ బాబుకు తల దువ్వకుండా పంపించారు..హే మేకప్ మేన్, హెయిర్ స్టైలిస్ట్ అంటూ బాలయ్య పిలుస్తుండగా.. ఇది మెస్సీ లుక్ సర్ అని చెప్పాడు సిద్దూ. దీంతో అలా తాను మెస్సీ లుక్ లో కనిపించిన సినిమాలన్ని మెస్సయ్యాయి అంటూ నవ్వులు పూయించారు.

ఆ తర్వాత సిద్ధూ.. విశ్వక్ ఇద్దరిని ఫ్లర్టింగ్ ఎలా చేయాలో చెప్పమని అడిగారు బాలయ్య. దీంతో డిజే టిల్లు చెబుతుండగా..విశ్వక్ సెటైర్ వేశారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి మీ కరెంట్ క్రష్ ఎవరని బాలయ్యను అడగ్గా.. రష్మిక మందన్నా అంటూ అసలు విషయం చెప్పేశారు. ఈ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంటే చాలు అని బాలకృష్ణ అడగ్గా.. తనకు కియరా అద్వానీ అంటే క్రష్ అని చెప్పేశాడు సిద్దూ. దీంతో షూటింగ్ లేకపోయిన పర్లేదు అంటూ మరో పంచ్ వేశారు బాలయ్య. మొత్తానికి ఈ ముగ్గురు కలిసి అన్‏స్టాపబుల్ వేదికపై రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది.

వీరికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే అక్టోబర్ 21 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!