ప్రస్తుతం మలయాళ సినిమాల క్రేజ్ నడుస్తోంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇక ఓటీటీలో అయితే మలయాళం సినిమాలదే పూర్తి హవా. అందుకు తగ్గట్టుగానే మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగుతో పాటు వివిధ భాషల్లోకి అనువదించి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. అదే టొవినో థామస్ నటించిన నీలవెలిచం. తెలుగులో భార్గవి నిలయం పేరుతో ఓటీటీలోకి రానుంది. గతేడాది ఏప్రిల్ 20న ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆషిక్ అబు తెరకెక్కించిన ఈ సూపర్ హారర్ థ్రిల్లర్ సినిమాలో టొవినో థామస్ తో పాటు రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. రాజేశ్ మాధవన్, చెంబన్ వినోద్ జోస్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్ వెలియనాడ్ తదితరులు కీ రోల్స్ లో మెరిశారు. మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా ఇప్పుడు భార్గవి నిలయం పేరుతో తెలుగులోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
గురువారం ( సెప్టెంబర్ 05) నుంచే ఈ సినిమా ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధకారికంగా ప్రకటించింది ఆహా. ‘భార్గవి నిలయంతో ఎంటర్‌టైన్ చేసేందుకు మన టొవినో థామస్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 5న ఆహాలో ప్రీమియర్ కానుంది’ అని ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే భార్గవి నిలయం సినిమా భయపెట్టేందుకు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందన్నమాట. ఓ పాడుపడిన భవనంలో ఆత్మ తిరగడం, ఆ ఫ్లాష్‍బ్యాక్, లవ్ స్టోరీ చుట్టూ భార్గవి నిలయం సినిమా తిరుగుతుంది. ఆడియెన్స్ ను ఆకట్టుకునే హారర్ ఎలిమెంట్లు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. మరి మీరు కూడా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారా? అయితే ఈ భార్గవి నిలయం కూడా చూసేయండి. మరికొన్ని గంటల్లో ఆహాలోకి అందుబాటులోకి వస్తోంది.
Our Tovino is ready to entertain you with
‘#BhargaviNilayam premieres on #aha from Sep 5th.🏠🎬@roshanmathew22 @PoojaMohanraj @ttovino @shinetomchacko_ @rimakallingal pic.twitter.com/leMWbAJURc— ahavideoin (@ahavideoIN) September 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.