Mission Impossible 7 OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన టామ్‌ క్రూజ్‌ను స్టార్‌ హీరోగా నిలబెట్టింది మాత్రం మిషన్‌ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలే. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు వచ్చాయి. అన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. యాక్షన్‌ ప్రియులతో పాటు సాధారణ ఆడియెన్స్‌ను అలరించాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.

Mission Impossible 7 OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Mission Impossible 7 Movie

Updated on: Jan 13, 2024 | 12:39 PM

Mission Impossible 7 OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
టామ్‌ క్రూజ్‌.. సినిమా ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. అందులోనూ హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే యాక్షన్‌ సీక్వెన్స్‌, ఆడ్వెంచెరస్‌తో అలరించే ఈ స్టార్‌ హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన టామ్‌ క్రూజ్‌ను స్టార్‌ హీరోగా నిలబెట్టింది మాత్రం మిషన్‌ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలే. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు వచ్చాయి. అన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. యాక్షన్‌ ప్రియులతో పాటు సాధారణ ఆడియెన్స్‌ను అలరించాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇదిలా ఉంటే మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌కు త్వరలో శుభం కార్డు పడనుందని వార్తలు వస్తున్నాయి. అందుకే చివ‌రి సినిమాను రెండు పార్టులుగా విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు మేకర్స్‌. ఇందులో మొద‌టి భాగం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. ‘డెడ్‌ రెకొనింగ్‌: పార్ట్‌ 1’ జులై 12 న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. టామ్ క్రూజ్‌ తో పాటు హైలీ యాట్‌వెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌ వైడ్‌గా రూ. 4600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యాక్షన్‌ ప్రియులను అమితంగా అలరించిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఇదివరకు ఎప్పుడో ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతూ వచ్చింది. అంటే మూవీ చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది మిషన్‌ ఇంపాజిబుల్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం (జనవరి 12) అర్ధ రాత్రి నుంచే మిషన్‌ ఇంపాజిబుల్ 7 ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిలం, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 16 లాంగ్వెజెస్‌లో మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 10 స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ సినిమా. క్రిస్టోఫర్ మెక్ క్వారీ తెరకెక్కించిన ఈ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సైమన్ పెగ్, రెబెక్కా, హెన్రీ చెర్నీ, వనేసా కొర్బీ, పోమ్, ఇసై మోరల్స్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు టామ్ క్రూజ్, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీలే మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. మరి థియేటర్లలో మిషన్ ఇంపాజిబుల్‌7 మూవీని మిస్‌ అయ్యారా? అయితే పండగ సెలవుల్లో ఎంచెక్కా ఇంట్లోనే ఉండి ఈ యాక్షన్‌ మూవీని ఆస్వాదించండి.

ఇవి కూడా చదవండి

 అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి