AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devil OTT : మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

డెవిల్ సినిమా గత ఏడాది డిసెంబర్ 29న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది.

Devil OTT : మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Devil
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2024 | 12:47 PM

Share

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాబినయం చేశారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో  డెవిల్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. డెవిల్ సినిమా గత ఏడాది డిసెంబర్ 29న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యింది. డెవిల్ సినిమా అతీతే రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు డెవిల్ సినిమా ఓటీటీ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది.

డెవిల్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సడన్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్, సైందవ్, రిలీజ్ అయ్యాయి. అలాగే నా సామిరంగ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమాలు థియేటర్స్ లో అలరించనున్నాయి. ఇక డెవిల్ ఓటీటీలో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. మరి థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.