OTT Movie: ఈ హారర్ థ్రిల్లర్ నెక్ట్స్ లెవెల్.. భయంతో నిద్రలేని రాత్రులు గడిపిన యాక్టర్లు.. ఒంటరిగా చూడకండి

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ జానర్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే. సినిమా హిస్టరీలో అత్యంత భయానక చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.

OTT Movie: ఈ హారర్ థ్రిల్లర్ నెక్ట్స్ లెవెల్.. భయంతో నిద్రలేని రాత్రులు గడిపిన యాక్టర్లు.. ఒంటరిగా చూడకండి
OTT Movie

Updated on: Jul 25, 2025 | 1:01 PM

హారర్ సినిమాలు ఆద్యంతం ఎంతో ఎంగేజింగ్ గా సాగుతాయి. . భయపెట్టే స్టోరీలు, సస్పెన్స్‌కు గురిచేసే సీన్స్‌ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ను అందిస్తాయి. ఇప్పుడు మనం చర్చించుకోబోయే సినిమా ఇదే జానర్ లో నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ హారర్ జానర్‌లో ఒక సరికొత్త ట్రెండ్‌ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా కేవలం ఆడియెన్స్ ను మాత్రమే కాదు.. ఇందులో నటించిన యాక్టర్స్ ను కూడా భయ పెట్టింది. వారు చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ సినిమా షూటింగ్ ఊటీలోని ఫెర్న్‌హిల్ హోటల్, పైన్ ఫారెస్ట్, లారెన్స్ స్కూల్‌లో జరిగింది. ఈ ప్రాంతాల్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇందులో ఫేర్న్ హిల్ హోటల్ ఒకప్పుడు మైసూర్ మహారాజుల విడిది. ఈ హోటల్‌లో దెయ్యాలు, ఆత్మలు సంచరిస్తున్నాయని ప్రచారంలో ఉంది. అందుకే షూటింగ్ టైమ్ లో సెట్‌లో జరిగిన కొన్ని సంఘటనలు నటీనటులను చాలా భయపెట్టాయట. ఒకసారి హోటల్‌లో పైఅంతస్తు లేనప్పటికీ ఫర్నీచర్ జరుపుతున్న సౌండ్స్‌ వినిపించాయని ఇందులో నటించిన హీరోయిన్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. రాత్రి పూట డ్యాన్సర్లకు కూడా అలాంటి వింతైన, భయానక శబ్దాలు వినిపించాయట. అలాగే డాక్టర్ అంబేడ్కర్ ఫొటో జారిపడిందని.. అది కెమెరాలో రికార్డ్ అయ్యిందని కూడా సదరు హీరోయిన్ చెప్పింది. ఒక రాత్రి షూటింగ్ జరుగుతుండగా.. ఒక అమ్మాయి పాట పాడుతున్న గొంతు తనతో పాటు అందరికీ వినిపించిందని హీరోయిన్ చెప్పుకొచ్చింది.

ఇలా షూటింగ్ జరుగుతుండగానే యాక్టర్లను భయ పెట్టిన ఆ హారర్ సినిమాపేరు రాజ్. 2002లో రిలీజైన ఈ సినిమాలో బిపాషా బసు, డీనో మోరియా, మాలిని శర్మ, అశుతోష్ రాణా, విశ్వజీత్ ప్రధాన్ లీడ్ రోల్స్ చేశారు. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంజన (బిపాషా బసు), ఆదిత్య (డీనో మోరియా) దంపతులు ఊటీలోని ఒక బంగ్లాకు వెళతారు. అక్కడ వారికి కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఒక శక్తి వారిని వెంటాడటం మొదలుపెడుతుంది? మరి అది వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది. సంజన, ఆదిత్యలు బయటపడ్డారా? అన్నదే రాజ్ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

రాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇదే ఫ్రాంఛైజీలో ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ (2009), ‘రాజ్ 3D’ (2012), ‘రాజ్ రీబూట్’ (2016) సీక్వెల్స్‌ వచ్చాయి. ఈ సినిమాలన్నీ ఆడియెన్స్ ను బాగా భయ పెట్టాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.