The Nun 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన వెన్నులో వణుకు పుట్టించే మూవీ.. భయపెట్టే దెయ్యం సినిమా ఎక్కడ చూడొచ్చంటే..
వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ నుంచి దెయ్యాల సినిమాలు చాలా వచ్చాయి. అందులో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఇదే బ్యానర్ గతంలో 2018లో వచ్చిన మరో హారర్ థ్రిల్లర్ మూవీ ది నన్ (The Nun). ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను భయపెట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమాకు.. ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లకు వచ్చిన సీక్వెల్ ది నన్ 2.
హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా దెయ్యం చిత్రాలను చూసేందుకు అడియన్స్ తెగ ఇంట్రెస్టింగ్గా ఉంటారు.ఈ మధ్యకాలంలో తెలుగులోనూ అదిరిపోయే హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చేస్తున్నాయి. కానీ.. నిజానికి ఈ హారర్ మూవీస్.. వెన్నులో వణుకుపుట్టించే సినిమాలకు హాలీవుడ్ కేరాఫ్ అడ్రస్. వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ నుంచి దెయ్యాల సినిమాలు చాలా వచ్చాయి. అందులో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఇదే బ్యానర్ గతంలో 2018లో వచ్చిన మరో హారర్ థ్రిల్లర్ మూవీ ది నన్ (The Nun). ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను భయపెట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమాకు.. ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లకు వచ్చిన సీక్వెల్ ది నన్ 2.
ఈ చిత్రాన్ని జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జుడ్సన్ స్కాట్ సంయుక్తంగా నిర్మించారు. మైఖేల్ చేవ్స్ దర్శక్తవం వహించిన ఈ మూవీలో సిస్టర్ ఇరేనే అనే ప్రధాన పాత్రలో టైస్సా ఫార్మి నటించింది. గతేడాది సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను ఓ రేంజ్ లో భయపెట్టింది ఈ మూవీ. దెయ్యంగా మారిన ఓ అందమైన అమ్మాయి కథే ది నన్ 2. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు అలా దెయ్యంగా మారింది ?.. ఆమె కథేంటీ ? అనేది సినిమాలో తెలుసుకోవచ్చు.
ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది అక్టోబర్ 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈమూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఓటీటీ ప్లా్ట్ ఫామ్ జియో సినిమాలోకి వచ్చేసింది ది నన్. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంలో భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులను అలరించింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన హారర్ మూవీ ప్రియులు ఇప్పుడు ఈ సినిమాను నేరుగా ఇంట్లోనే చూసేయ్యండి.
No matter what – Don’t. Look. Away! 👀#TheNun2 streaming now on #JioCinema Available in English, Hindi, Tamil & Telugu#TheNun2OnJioCinema pic.twitter.com/OkPn9vYxtj
— JioCinema (@JioCinema) February 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.