Telugu Indian Idol : ఆయనతో నా అనుబంధం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.. ఫుల్ ఎపిసోడ్ చూశారా.. ?

ఆహా ఓటీటీలో అత్యధిక రెస్పాన్స్ అందుకుంటున్న షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈషో.. ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తుంది. తాజా ఎపిసోడ్ కు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.

Telugu Indian Idol : ఆయనతో నా అనుబంధం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.. ఫుల్ ఎపిసోడ్ చూశారా.. ?
Aha

Updated on: Oct 17, 2025 | 9:19 PM

ప్రముఖ ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మూడో సీజన్ రన్ అవుతుంది. ఈ షోకు థమన్, కార్తిక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహిస్తుండగా.. సింగర్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ కలిసి హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు పలువురు సినీతారలు ఈ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు లేటేస్ట్ ఎపిసోడ్ కు బ్రహ్మానందం అతిథిగా వచ్చారు. బ్రహ్మానంద లహరి పేరుతో చేసిన ఈ ఎపిసోడ్ లో తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించారు బ్రహ్మానందం. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

ఇటీవల విడుదలైన ప్రోమోలో బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ షోలో.. మీరు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్..అల్లాడిపోతున్నా సార్ నేను.. అంటూ సమీరా భరద్వాజ్ చెప్పగానే బ్రహ్మీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ హైలెట్ అయ్యింది. షో స్టార్ట్ చేయడానికి ముందు మీ స్టైల్లో ఆల్ ది బెస్ట్ వాళ్లకు చెప్తే.. అని అడగ్గానే కామెడీగా చెప్పారు బ్రహ్మానందం. సింగర్ పవన్ కళ్యాణ్ బిజినెస్ మ్యాన్ చిత్రంలోని పిల్ల చావ్ సాంగ్ ఆలపించాడు. దీంతో తమన్, గీతా మాధురి సహా అందరూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ఇక తర్వాత వారెవ్వా ఏమి ఫేసూ.. అచ్చం హీరోలా ఉంది బాసూ.. అంటూ బ్రహ్మీని పొగుడుతూ సింగర్స్ పాట పాడారు. నన్ను ఎందుకు ఇలా అందరూ టార్గెట్ చేశారో అర్థం కాలేదు అంటూ బ్రహ్మానందం నవ్వుకున్నారు. ఇక ఇదే ఎపిసోడ్ లో సింగర్ ఎస్బీబీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మీ. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ఎస్బీబీ గురించి బ్రహ్మీ ఏం చెప్పారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. తాజాగా ఈ ఎపిసోడ్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ ఎపిసోడ్ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..