AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి డబుల్ ధమాకా.. జీ 5లోకి క్రేజీ సినిమాలు, అదిరిపోయే సిరీస్ లు

దీపావళి పండుగను మరింత సందడిగా మార్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. తెలుగు సినిమాలతో పాటు ఆకట్టుకునే సినిమాలతో పాటు.. హిందీ నుంచి భగవత్ చాప్టర్ వన్ - రాక్షస్, సాలీ మోహబ్బత్, హనీమూన్ సే హత్య వంటి సిరీస్‌లు రాబోతోన్నాయి.

దీపావళికి డబుల్ ధమాకా.. జీ 5లోకి క్రేజీ సినిమాలు, అదిరిపోయే సిరీస్ లు
Ott Movies
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2025 | 4:19 PM

Share

ఈ దీపావళి సందర్భంగా ఎన్నెన్నో కొత్త కథలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్ని ZEE5 అందిస్తోంది. హిందీ నుంచి భగవత్ చాప్టర్ వన్ – రాక్షస్, సాలీ మోహబ్బత్, హనీమూన్ సే హత్య వంటి సిరీస్‌లు రాబోతోన్నాయి. మరాఠీ నుంచి స్థల్, అత తంబ్యాచ్ నాయ్, జరణ్ వంటి కథతలు రానున్నాయి. బెంగాలీ నుంచి శ్రీమతి దాస్ గుప్తా, మ్రిగయ ది హంట్, అబర్ ప్రోలోయ్ వంటి సిరీస్‌లు వస్తున్నాయి. తెలుగు నుంచి కిష్కింధపురి, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, జయమ్ము నిశ్చయమ్మురా వంటివి రానున్నాయి. తమిళం నుంచి వేదువన్, హౌస్ మేట్స్, మామన్ వంటి సినిమాలు ఉన్నాయి. మలయాళం నుంచి సుమతి వలువు, అభంతర కుట్టవాలి, కమ్మట్టం వంటివి సిద్దంగా ఉన్నాయి. ఇక కన్నడ నుంచి ఏలుమలే, అయ్యన మనే, మరిగల్లు వంటి కథలు అలరిస్తాయి. ఈమేరకు

ZEE5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ మాట్లాడుతూ .. ‘ప్రతి దీపావళి సంప్రదాయాలు, వేడుకలు, అందమైన క్షణాల కథను చెబుతుంది. ZEE5లో మేము ప్రతి భాషలో, ప్రతి సినిమాతో ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించే విధంగా ఆ కథలకు ప్రాణం పోస్తాము. ఈ పండుగ సందర్భంగా స్థానికంగా ప్రతి భాషలో ప్రతిధ్వనించే కంటెంట్‌ను అందించాలని అనుకున్నాం. అందుకే రకరకాల కథల్ని యాక్సెసిబిలిటీని పెంచేలా పండుగ ఆఫర్‌లతో అందిస్తున్నాం. ఈ దీపావళిలో, ప్రేక్షకులు కొత్త కథలను చూడాలని, వాటితో నిజంగా కనెక్ట్ అవ్వాలని, ఈ పండుగ సీజన్‌ను ఆనందంగా జరుపుకోవాలని మేం ఆశిస్తున్నాము’ అని అన్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మహాదేవ్ మాట్లాడుతూ .. ‘దీపావళి పండుగ భారతదేశం ఆచారానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ క్రమంలో మేం సినీ ప్రేమికుల కోసం కొత్త కథల్ని చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా పండుగ ఆఫర్‌లను ప్రకటించాం. థ్రిల్లర్‌లు, మిస్టరీలు, క్రైమ్ డ్రామా, ప్రేమ ఇలా అన్ని రకాల్ని కథల్ని అందించాలని ప్రయత్నిస్తున్నాం. ‘ఈ దీపావళి కేవలం ZEE5 తోనే ఛేంజ్ అవుతుంది.. సిద్దంగా ఉండండి’ అనే ప్రచారం ZEE5 కథలలోని మలుపుల మాదిరిగానే ఆవిష్కరణ, ఆశ్చర్యం కలిగించేలా స్ఫూర్తితో ఉంటుంది. ఇది మా ప్లాట్‌ఫామ్‌లోని ఉత్సాహాన్ని చూపుతుంది. ఈ దీపావళిని అందరికీ ప్రత్యేకంగా ఉండాలని మేం ఆశిస్తున్నామ’ని అన్నారు. హై-ఆక్టేన్ థ్రిల్లర్‌లు, ఫ్యామిలీ డ్రామాలు, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ ఇలా అన్నీ కూడా ఈ పండుగ సీజన్‌లో ZEE5 అందరికీ అందుబాటులోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 13 నుండి 20 వరకు ZEE5లో జరిగే భారత్ బింగే ఫెస్టివల్‌లో చేరండి, అసాధారణ కథలతో పాటుగా ప్రత్యేకమైన ఆఫర్‌లతో ఎంజాయ్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.