Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ ‘గొర్రె పురాణం’ సినిమా.. విడుదలైన మూడు వారాల్లోనే స్ట్రీమింగ్..

|

Oct 07, 2024 | 8:27 PM

సెప్టెంబర్ 21న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. టైటిల్ తోనే రిలీజ్ కు ముందు ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. కానీ థియేటర్లలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ గొర్రె పురాణం సినిమా.. విడుదలైన మూడు వారాల్లోనే స్ట్రీమింగ్..
Gorre Puranam Ott
Follow us on

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవేల ప్రసన్న వదనం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్.. గత మూడు వారాల క్రితం గొర్రె పురాణం సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. రోటిన్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన గొర్రె పురణం మూవీలో పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. టైటిల్ తోనే రిలీజ్ కు ముందు ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. కానీ థియేటర్లలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ చిత్రాన్ని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నామంటూ కొన్ని రోజులుగా ప్రకటించిన ఆహా.. ఇప్పుడు స్ట్రీమింగ్ కూడా ప్రకటించింది. థియేటర్లలో మిక్డ్స్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే రెండు వర్గాల మధ్య గొడవలకు ఒక గొర్రె ఎలా కారణమైందనే విషయం చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో మరోసారి తన సహజ నటనతో మెప్పించాడు సుహాస్. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.