AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Police Force OTT: ఓటీటీలో భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్.. తెలుగులో కూడా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో భారీ యాక్షన్‌ సినిమాలు తీయడంలో డైరెక్టర్‌ రోహిత్ శెట్టిది ప్రత్యేక శైలి. ముఖ్యంగా ఆయన పోలీసుల నేపథ్యంలో తెరకెక్కించిన సింగం సిరీస్‌ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. రోహిత్‌ డైరెక్ట్‌ చేసిన సింబా, సూర్యవంశీ వంటి సూపర్‌ హిట్ సినిమాలు కూడా పోలీస్‌ నేపథ్యంలో రూపొందినవే. ఇప్పుడు పోలీసుల నేపథ్యంలోనే ఓ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ స్టోరీతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారాయన

Indian Police Force OTT: ఓటీటీలో భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్.. తెలుగులో కూడా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Indian Police Force Web Series
Basha Shek
|

Updated on: Oct 22, 2023 | 6:07 PM

Share

బాలీవుడ్‌లో భారీ యాక్షన్‌ సినిమాలు తీయడంలో డైరెక్టర్‌ రోహిత్ శెట్టిది ప్రత్యేక శైలి. ముఖ్యంగా ఆయన పోలీసుల నేపథ్యంలో తెరకెక్కించిన సింగం సిరీస్‌ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. రోహిత్‌ డైరెక్ట్‌ చేసిన సింబా, సూర్యవంశీ వంటి సూపర్‌ హిట్ సినిమాలు కూడా పోలీస్‌ నేపథ్యంలో రూపొందినవే. ఇప్పుడు పోలీసుల నేపథ్యంలోనే ఓ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ స్టోరీతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారాయన. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ డ్రామా ఇండియన్‌ పోలీస్‌ పోర్స్‌. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రకటించిన మేకర్స్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను కూడా ఫైనలైజ్‌ చేశారు. ఈ యాక్షన్‌ సిరీస్‌కు రోహిత్ పాటు సుశ్వాంత్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో సిద్ధార్థ మల్హోత్రా, సీనియర్‌ నటి శిల్పాశెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌, శ్వేతా తివారి, ముకేష్‌ రిషి, నికితిన్‌ ధీర్‌, రితురాజ్‌ సింగ్‌, లలిత్‌ పరిమో, శరద్ ఖేల్కర్‌.. ఇలా పలువురు ప్రముఖ నటీనటులు ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటోన్న ఈ సూపర్‌ యాక్షన్‌ వెబ్ సిరీస్‌ వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ వెబ్‌ సిరీస్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ (సింగం), అక్షయ్‌ కుమార్‌ (సూర్యవంశీ), రణ్‌వీర్‌ సింగ్‌ (సింబా) స్పెషల్‌ రోల్స్‌లో కనిపించనున్నారు. ‘లైట్స్, సైరన్, యాక్షన్. అమెజాన్ ఒరిజినల్ భారీ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ 2024 జనవరి 19వ తేదీన రానుంది. రోహిత్ శెట్టి నుంచి థ్రిల్లింగ్‌ గా సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ , రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ ను నిర్మింఆచాయి. తనిష్క్‌ బాగ్చీ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

పవర్ ఫుల్ రోల్ లో శిల్పాశెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..