Virata Parvam​ : ఓటీటీ కే ఓటేస్తున్న బడా ప్రొడ్యూసర్.. విరాటపర్వం కూడా అదే దారిలో..

| Edited By: Anil kumar poka

Jul 14, 2021 | 8:12 AM

దగ్గుబాటి యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇటీవలే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా.

Virata Parvam​ : ఓటీటీ కే ఓటేస్తున్న బడా ప్రొడ్యూసర్.. విరాటపర్వం కూడా అదే దారిలో..
Rana
Follow us on

Virata Parvam​ : దగ్గుబాటి యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇటీవలే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఆ మధ్య కరోనా కాస్త గ్యాప్ ఇచ్చిన టైంలో థియేటర్స్ లో అరణ్య సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు విరాటపర్వం సినిమాతో  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఎప్పుడు ఎప్పుడు సినిమాను విడుదల చేద్దామా అని చిత్రయూనిట్ చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కాబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఆ వార్తలను ఖండించిన చిత్ర నిర్మాత సురేష్ బాబు.. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఓటీటీ వైపు చూస్తున్నారని అంటున్నారు.

అయితే విరాటపర్వం సినిమాను కొనుక్కునేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీపడుతున్నాయట. సినిమాకోసం భారీ ఆఫర్లను నిర్మాత ముందు ఉచుతున్నారట. దాంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం భారీ మొత్తం ను ఆఫర్ చేసిందట. దాంతో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నారు. ఈ సినిమా తోపాటు గుణశేఖర్ రూపొందిస్తున్న హిరణ్య కశ్యప సినిమాలో నటిస్తున్నారు రానా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood: సోనూసూద్ పై అభిమానంతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. కారణం తెలిసి షాకైన తల్లిదండ్రులు..

Nivetha Pethuraj: కార్ రేసర్‏గా మారిన హీరోయిన్.. రేసింగ్ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందుకున్న నివేతా పేతురాజ్..

Suresh Babu: కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతకే మూవీపై సర్వ హక్కులు.. ఎక్కడ రిలీజ్ చేయాలనేది తన ఇష్టం.. ‘నారప్ప’ ఓటీటీపై సురేష్ బాబు క్లారిటీ..