AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Naidu 2: వెయిటింగ్ ఓవర్.. రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. సుమారు రెండేళ్ల క్రితం ఓటీటీలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ యువతను బాగా ఆకట్టుకుంది. అదే సమయంలో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో తీవ్ర విమర్శల పాలైంది.

Rana Naidu 2: వెయిటింగ్ ఓవర్.. రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Rana Naidu Season 2
Basha Shek
|

Updated on: Jun 03, 2025 | 1:54 PM

Share

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువత అయితే ఈ సిరీస్ ను ఎగబడి చూశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీసుల్లో ఒకటిగా రానా నాయుడు నిలిచింది. అయితే ఇందులోని కంటెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు, అందులోనూ బాబాయ్ అబ్బాయ్ లు వెంకటేశ్, రానా ఇలాంటి అడల్ట్ వెబ్ సిరీస్ లో నటించడంపై అభిమానులు భగ్గుమన్నారు. ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ ఓ వర్గానికి బాగా నచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు కొనసాగింపు ఉంటుందని మొదటి పార్ట్ లోనే క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్లే ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

తొలి సీజన్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండో భాగంలో అలాంటి కంటెంట్ తక్కువే ఉంటుందని గతంలోనే వెంకటేశ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ట్రైలర్‌ కట్‌లో కూడా ఎలాంటి అభ్యంతరకర సీన్స్, డైలాగులు లేవు. అయితే తొలి సీజన్‌కు మించిన యాక్షన్ సీన్స్, థ్రిల్‌ను రానా నాయుడు 2లో ఉన్నాయని పిస్తోంది. కాగా రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

జూన్ 13 నుంచి స్ట్రీమింగ్..

కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రా తెరకెక్కించిన రానా నాయుడు సీజన్ 2 లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియాలాంటి స్టార్ యాక్టర్లు నటించారు

రానా నాయుడు 2 ట్రైలర్..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్