ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ మాలీవుడ్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అది కూడా తెలుగు వెర్షన్ తో. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేరళ బ్యూటీ రజిషా విజయన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం కీడం. రాహుల్ రిజీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్… 2022లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.
అయితే సుమారు రెండేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్ కానుంది. కీచు రాళ్లు పేరుతో తెలుగు వెర్షన్ ను రెడీ చేశారు. అయితే థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వేదికగా గురువారం (మే 30) నుంచి ఈ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానుంది. అంటే ఇవాళ అర్ధ రాత్రి నుంచే కీచు రాళ్లు సినిమాను ఓటీటీలో చూడవచ్చన్న మాట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. అలాగే కీచు రాళ్లు సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సినిమా కథ ఏంటంటే?
కీచు రాళ్లు సినిమాలో రజిషా విజయన్‌తో పాటు శ్రీనివాసన్, విజయ్ బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. రాధికా బాలన్ (రజిషా విజయన్) ఓ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా సైబర్ క్రైమ్ కు సంబంధించిన కేసులను పరిష్కరిస్తుంది. పోలీసులకు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటుంది. అయితే అనుకోకుండా రాధికానే ఓ సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిపోతుంది? ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంటాడు. మరి తన సమస్యను ఆమె ఎలా పరిష్కరించుకుందన్నదే కీచు రాళ్లు సినిమా.
The most anticipated thriller film of the week #Keedam ➡️ #keechurallu
Only on @etvwin pic.twitter.com/iSGITK1kaP— ETV Win (@etvwin) May 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి