
100 పర్సెంట్ తెలుగు కంటెంట్ తో ఓటీటీ ఆడియెన్స్ కు బాగా చేరవవుతోంది ఆహా. ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు
గేమ్ షోలు, టాక్ షోలు, సింగింగ్ షోలతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది ఆహా. ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ. జబర్దస్త్ కమెడియన్ అభినయ్ అలియాస్ అదిరే అభి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కుషితా కుళ్లపు హీరోయిన్ గా నటిస్తోంది. ఎ రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ముందుగా దీనిని ఒక వెబ్ సిరీస్ గా తెరకెక్కించాలని అనుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు దాన్ని సినిమాగా మార్చి రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవ సినిమాలో రచ్చ రవి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజా రవీంద్ర, టేస్టీ తేజా, గడ్డం నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఈ నేపథ్యంలో దసరా పండగను పురస్కరించుకుని చిరంజీవ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘చిరంజీవ మీటర్ లో చాలా మ్యాటర్ ఉంది’ అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ టీజర్ సినిమాపై అంచానాలను పెంచేస్తోంది.
ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంబులెన్స్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. టీజర్ లో డైలాగులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. చిరంజీవ సినిమా నవంబర్ 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT
— ahavideoin (@ahavideoIN) October 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.