AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2 OTT: ఇంట్లోకి ‘లక లక’.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘చంద్రముఖి 2’.. ఎక్కడ చూడొచ్చంటే?

'లక లక' అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు చంద్రముఖి మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను హడలెత్తించిన ఈసారి ఏకంగా  ఇంట్లోకి వచ్చేసింది. అదేనండి చంద్రముఖి 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (అక్టోబర్‌ 26) అర్ధ రాత్రి నుంచే ఈ కామెడీ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. గతంలో రజనీకాంత్, జ్యోతిక, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌..

Chandramukhi 2 OTT: ఇంట్లోకి 'లక లక'.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 'చంద్రముఖి 2'.. ఎక్కడ చూడొచ్చంటే?
Chandramukhi 2 Movie
Basha Shek
|

Updated on: Oct 26, 2023 | 11:57 AM

Share

‘లక లక’ అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు చంద్రముఖి మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను హడలెత్తించిన ఈసారి ఏకంగా  ఇంట్లోకి వచ్చేసింది. అదేనండి చంద్రముఖి 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (అక్టోబర్‌ 26) అర్ధ రాత్రి నుంచే ఈ కామెడీ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. గతంలో రజనీకాంత్, జ్యోతిక, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన పి. వాసునే చంద్రముఖి 2 కు కూడా దర్శకత్వం వహించారు. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లారెన్స్‌, కంగనాల అభినయం బాగున్నా పాత చంద్రమఖి కథనే మళ్లీ తిరిగి చూపించారంటూ విమర్శలు వినిపించాయి. దీంతో చంద్రముఖి 2 ప్రేక్షకులను అలరించలేకపోయింది . తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ ఓ మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. అయితే ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ చంద్రముఖి 2 సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే బుధవారం అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం చంద్రమఖి 2 సినిమా తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చంద్రముఖి 2 సినిమాలో లక్ష్మీ మేనన్‌, వడివేలు, రాధికా శరత్ కుమార్‌, మహిమా నంబియార్‌, రావు రమేశ్‌, శత్రు, అయ్యప్ప శర్మ, ఆర్‌ ఎస్‌ శివాజీ, వైజీ మహేంద్రన్‌, మనోబాల, సుభీక్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎమ్.ఎమ్‌.కీరవాణి బాణీలు సమకూర్చారు. ఇక చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ సుమారు రూ.8 కోట్లు వెచ్చిందని టాక్‌ నడుస్తోంది. మరి చంద్ర ముఖి 2 సినిమాను థియేటర్లలో చూడని వారు, పర్వాలేదు చూడాలి అనుకునేవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

వెట్టియన్ రాజుగా రాఘవ లారెన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?