OTT: ఓటీటీలో మరో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో మలయాళ సూపర్ హిట్ సినిమా సిద్ధమైంది. అదే సలార్ ఫేమ్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’. విపిన్‌ దాస్‌ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ కామెడీ డ్రామాలో సిల్‌ జోసెఫ్‌, రేఖ, నిఖిలా విమల్‌, అనస్వర రాజన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు

OTT: ఓటీటీలో మరో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Guruvayoor Ambalanadayil Movie
Follow us

|

Updated on: Jun 25, 2024 | 8:02 PM

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పలు ఓటీటీ సంస్థలు కూడా పలు మలయాళ సినిమాలను ఆయా ప్రేక్షకులకు తగ్గట్టుగా డబ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో మలయాళ సూపర్ హిట్ సినిమా సిద్ధమైంది. అదే సలార్ ఫేమ్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’. విపిన్‌ దాస్‌ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ కామెడీ డ్రామాలో సిల్‌ జోసెఫ్‌, రేఖ, నిఖిలా విమల్‌, అనస్వర రాజన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 16న రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లు సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ ఏకంగా రూ. 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.  థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో  ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్.

జూన్‌27 నుంచి ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’  సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.  మలయాళంతో పాటు,  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా స్ట్రీమింగ్ కుఅందుబాటులోకి రానుంది.  ఇక ఓవర్‌సీస్‌ అభిమానుల కోసం సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరో 2 రోజుల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..