Mangalavaaram OTT: ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ మంగళవారం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు లేదా 40 రోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి సినిమాలు. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక కొత్త సినిమా థియేటర్స్ లోకి వచ్చిందంటే అది ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇప్పుడు మంగళవారం అనే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

థియేటర్స్ లో సినిమాలు చూడటంతో పాటు ఓటీటీలోనూ చూడటానికి ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్.. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలోనూ రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు లేదా 40 రోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి సినిమాలు. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక కొత్త సినిమా థియేటర్స్ లోకి వచ్చిందంటే అది ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇప్పుడు మంగళవారం అనే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది.
అందాల ఆరబోతలో రెచ్చిపోయి నటించిన పాయల్.. మంగళవారం సినిమాలోనూ అదే రేంజ్ లో రెచ్చిపోయి ఆకట్టుకుంది. ఇక మంగళవారం సినిమా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మంచి హిట్ గా నిలిచిన మంగళవారం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంగళవారం సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా మంగళవారం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ 22న మంగళవారం సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.