AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో మరో రియల్ క్రైమ్ స్టోరీ.. మసాజ్‌ పేరుతో మర్డర్స్ చేసే సైకో కిల్లర్.. IMDBలో 9.4 రేటింగ్

1990లలో జావేద్ ఇక్బాల్ అనే ఓ రియల్ సీరియల్ కిల్లర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తన దగ్గరకు వచ్చిన క్లయింట్లకు మసాజ్ లు చేస్తూ దాదాపు వంద మందిని పైగా హతమార్చాడీ సైకో కిల్లర్. తన తెలివితేటలు, నేర్పరితనంతో పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపించాడీ హార్డ్ కోల్ క్రిమినల్

OTT Movie: ఓటీటీలో మరో రియల్ క్రైమ్ స్టోరీ.. మసాజ్‌ పేరుతో మర్డర్స్ చేసే సైకో కిల్లర్.. IMDBలో 9.4 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 26, 2026 | 9:07 PM

Share

నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా ఈ మధ్యన సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీలు అందులోనూ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. 1990లలో పాకిస్థాన్‌లోని రావల్పిండిలో కలకలం సృష్టించిన జావేద్ ఇక్బాల్ అనే రియల్ సీరియల్ కిల్లర్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇతను మసాజ్ పేరుతో తన దగ్గరకు వచ్చిన సుమారు 100 మందికి పైగా క్లయింట్లను దారుణంగా హత మార్చాడు. మరి ఆ సీరియల్ కిల్లర్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా గంధార ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకుంది. అలాగే పంజాబ్ పోలీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రశంసలు అందుకుంది. ఇందులో నటించిన ఆర్టిస్టులకు కూడా అవార్డులు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాను చాలా తక్కువ ఖర్చుతో, ఎటువంటి భారీ సెట్లు లేకుండా రావల్పిండి వీధుల్లోనే షూట్ చేశారు. అయినప్పటికీ  ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం విశేషం.

కథేమిటంటే?.

పాకిస్తాన్ లోని రావల్పిండి నగరంలో ‘జుజ్జీ’ అనే వ్యక్తి రోడ్డు పక్కన మసాజ్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతను చూడటానికి చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ రాత్రి అవ్వగానే రాక్షసుడిలా మారిపోతాడు. ఒంటరిగా దొరికిన అమాయకులను లక్ష్యంగా చేసుకుని హతమారుస్తుంటాడు. ఇలా నగరంలో వరుస హత్యలతో అందరూ భయపడిపోతారు. ఇదే క్రమంలో నవీద్ అనే పోలీస్ ఆఫీసర్, అర్షద్ అనే కానిస్టేబుల్ జుజ్జీ ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతారు. మరి ఆ క్రిమినల్ పోలీసులకు దొరికాడా? లేదా ? అసలు కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? చివరికి ఏమైపోయాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

హబీబ్ షాజాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘జుజ్జీ’. ఇదొక పాకిస్తాన్ సినిమా. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్, Tubi ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us