AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: బ్యాడ్‌ లక్ అంటే ఈ అమ్మడిదే! ధురంధర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ ది రివేంజ్ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరింది. అంతకు ముందు ధరంధర్ పార్ట్ 1 కూడా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మరి ఈ బ్లాక్ బస్టర్ సినిమా సిరీస్ లో కీలకమైన హీరోయిన్ పాత్రను రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా?

Dhurandhar 2: బ్యాడ్‌ లక్ అంటే ఈ అమ్మడిదే! ధురంధర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Mar 26, 2026 | 6:55 PM

Share

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్ ది రివేంజ్. గతేడాది వచ్చిన ధురంధర్ సినిమాకు ఇది సీక్వెల్. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 సినిమా మొదటి పార్ట్ కు మించి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా సిరీస్ రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ కు జోడీగా సారా అర్జున్ నటించింది. యలీనా జమాలీ పాత్రలో అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఫస్ట్ పార్ట్ లో అల్లరి పిల్లగా కనిపించిన సారా రెండో పార్ట్ లో మాత్రం అదరగొట్టింది. దీంతో మరోసారి ఈ అమ్మడి పేరు తెగ మార్మోగిపోతోంది. అయితే ధురంధర్ సిరీస్ లో యలీనా జమాలీ పాత్రకు సారా అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ పాత్రకోసం ముందుగా బాలీవుడ్ నటి కియారా అద్వాణీని సంప్రదించారట మేకర్స్. కానీ అప్పటికే కియారా వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ఛాన్స్ సారా అర్జున్ కు వెళ్లిందట.

కాగా కియారా అద్వానీ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ధురంధర్ సినిమా చేసి ఉంటే కియారా అద్వానీ కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్ పడేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కియారా గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకుందని నెటిజెన్స్ మండిపడుతున్నారు. కాగా కియారా చివరిగా వార్ 2 మూవీలో నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ యశ్ తో టాక్సిక్ మూవీలో నటిస్తోంది కియారా.. ఈ మూవీతో అయినా కియారా కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

సారా అర్జున్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sara Arjun (@saraarjunn)

కాగా ఆ మధ్యన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధురంధర్ సిరీస్ ను రిజెక్ట్ చేసిందన్న ప్రచారం జరిగింది. ముందుగా అనుకున్న సినిమాల కారణంగా ధురంధర్ సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని, ఒకవేళ కమిట్మెంట్స్ లేకపోయుంటే కచ్చితంగా ఈ చిత్రం చేసి ఉండేదాడని అంటూ తన స్నేహితులతో చెబుతోందట ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us