AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: వీరికి జీవితాంతం రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. కేంద్ర ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. ఎవరెవరికి అంటే..?

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ అందించింది. ప్రస్తుతం రైళ్లల్లో దివ్యాంగులు, విద్యార్థులుకు టికెట్లపై రాయితీ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రజాప్రతినిధులకు కూడా రైళ్లల్లో ప్రత్యేక రిజర్వేషన్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ క్రమంలో కేంద్రం వారికి ఉచిత రైల్వే ప్రయాణాన్ని ప్రకటించింది.

Indian Railways: వీరికి జీవితాంతం రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. కేంద్ర ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త.. ఎవరెవరికి అంటే..?
trains
Venkatrao Lella
|

Updated on: Mar 26, 2026 | 8:59 PM

Share

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శౌర్య పురస్కార గ్రహితలకు తీపికబురు అందించింది. ఈ పురస్కారం పొందిన సైనికులను గౌరవించడంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి పురస్కార గ్రహీతలకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారి కుటుంబాలకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు నిబంధనలను నోటిఫై చేయగా.. ఎవరెవరికి వర్తిస్తుందనేది కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.

రైళ్లల్లో జీవితాంతం ఉచిత ప్రయాణం

శౌర్య పురస్కార గ్రహీతలందరూ జీవితాంతం దేశంలో ఎక్కడనుంచి ఎక్కడికైనా ఉచితంగా రైళ్లల్లో ప్రయాణం చేయవచ్చు. ఇక పురస్కార గ్రహీత మరణిస్తే జీవిత భాగస్వామికి వర్తిస్తుంది. ఒకవేళ జీవిత భాగస్వామి మరో పెళ్లి చేసుకుంటే ఉచిత ప్రయాణం వర్తించదు. ఇక పెళ్లి కాని సైనికుడికి మరణాంతరం పురస్కారం లభిస్తే.. తల్లిదండ్రులతో పాటు వారితో పాటు తోడుగా వవ్చే ఒక వ్యక్తికి ఉచిత రైలు ప్రయాణం అందుతుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, ఏసీ చైర్ కార్ కోచ్‌లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సైనికుల కుటుంబాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు, వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. దీని వల్ల చాలామంది లబ్ది పొందనున్నారని, సైనికుల త్యాగాలను గుర్తించి వారికి గౌరవం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

రైల్వే రిక్రూట్‌మెంట్లలో ప్రత్యేక రిజర్వేషన్

గతంలో అగ్నివీర్లు, పౌర జీవితంలోకి మారి సేవలందిస్తున్న సైనిక సిబ్బందికి పదవీ విరమణ తర్వాత వృత్తి అవకాశాలను మెరుగుపర్చేందుకు రైల్వేశాఖ సహకారం అందిస్తోంది. అందులో భాగంగా రైల్వేలోని ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన పెంచుతోంది. పదవీ విరమణ చేసిన సిబ్బందికి సహాయపడటానికి, వారికి మద్దతుగా నిలబడటానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. మాజీ అగ్నివీర్లు, సైనికులకు ఉపాధి కల్పించేందుకు లెవల్ 2, అంతకంటే పై స్థాయి పోస్టుల్లో 10 శాతం, లెవల్ 1 పోస్టుల్లో 20 శాతం రిజర్వేషన్లను రైల్వేశాఖ కల్పిస్తోంది. 2024,2025లో మాజీ సైనికుల కోసం 14,788 ఖాళీలను రైల్వేశాఖ భర్తీ చేసింది. లెవల్-1లో 6848, లెవల్ 2లో 8303 పోస్టులు ఉన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ఈ నియామకాలను చేపడుతున్నాయి. కాగా సైన్యంలో అత్యంత ప్రతిభ కనబర్చినవారికి, ధైర్యసాహాసాలను ప్రదర్శించినవాకికి వీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర లాంటివి పురస్కారాలను కేంద్రం ప్రదానం చేస్తూ ఉంటుంది.

Follow Us
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు!
తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు!
అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే
అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే
ఉత్కంఠతో సాగే సినిమా.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్..
ఉత్కంఠతో సాగే సినిమా.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్..
కేంద్రం మరో అద్బుత స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు
కేంద్రం మరో అద్బుత స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!