AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : క్షణక్షణం ఉత్కంఠ.. మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ రెస్పాన్స్..

ప్రస్తుతం జియో హాట్ స్టార్ ఓటీటీలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా తెగ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా ఆద్యంతం ఆసక్తితో మిస్టీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. . మొదట్లో ఈ సినిమా ప్రశాంతంగా, నెమ్మదిగా సాగుతుంది. కానీ ఆ తర్వాత ఆకస్మాత్తుగా మలుపులు తీసుకుంటుంది. ఆ విజువల్స్, ట్విస్టులు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. నెమ్మదిగా ప్రారంభమైన ఈ సిరీస్ క్లైమాక్స్ వరకు క్యూరియాసిటీని కలిగిస్తూనే ఉంటుంది.

Cinema : క్షణక్షణం ఉత్కంఠ.. మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ రెస్పాన్స్..
Dridam
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2026 | 6:39 PM

Share

మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, క్రైమ్ త్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. ఆ సినిమా పేరు దృదం. మలయాళీ థ్రిల్లర్ ఇది.. మొదట్లో ప్రశాంతంగా, నెమ్మదిగా సాగుతుంది. కానీ తర్వాత అనుకోని ట్విస్టులు.. భయంకరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మతిపోగొడుతుంది. ముఖ్యంగా ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా జనాలను ఆశ్చర్యపరుస్తుంది. 128 నిమిషాల నిడివి గల ఈ థ్రిల్లర్‌ ప్రశాంతంగా మొదలవుతుంది. మొదటి 25 నుండి 30 నిమిషాల వరకు దర్శకుడు పాత్రలను, వారి సంబంధాలను, వారి దినచర్యలను పరిచయం చేయడానికి సమయం తీసుకుంటాడు. సినిమా మొదటి అరగంట గడుస్తున్న కొద్దీ ప్రతీకారానికి ఆస్కారం లేకుండా ఒక విషాద సంఘటన చోటుచేసుకుంటుంది. అకస్మాత్తుగా జరిగిన ఒక నేరం, దాన్ని కప్పిపుచ్చడానికి చేసే తీవ్ర ప్రయత్నం సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తాయి.

128 నిమిషాల అసలైన డ్రామా ఇక్కడే మొదలవుతుంది. తెరపై జరిగే సంఘటనలు మలుపులు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి సన్నివేశంతో ఉత్కంఠ మరింత పెరుగుతూ, తర్వాత ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు నిరంతరం ఎదురుచూసేలా చేస్తుంది. ఇది పూర్తిగా దిమ్మతిరిగేలా చేసే ఒక డ్రామా. పోలీసులు చేసే క్షుణ్ణమైన దర్యాప్తు, సాక్ష్యాలను నాశనం చేయడంలో చూపిన చాకచక్యం, చట్టం పట్టు నుండి తప్పించుకోవడానికి పన్నిన కుట్రలు ఈ చిత్రాన్ని విజయవంతం చేశాయి. . క్లిష్ట పరిస్థితులలో ప్రధాన పాత్రధారి తన తెలివిని ఉపయోగించే తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కథలో సస్పెన్స్, డ్రామా , థ్రిల్‌ల సమతుల్యత అద్భుతంగా ఉంది.

ఇందులో అనవసరమైన పాటలు గానీ, బలవంతపు డ్రామా గానీ లేవు. మీరు ఒక గొప్ప సినిమా అనుభూతిని కోరుకుంటున్నట్లయితే, జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ మలయాళ థ్రిల్లర్ మీకు సరికొత్త , మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. ఏ సినిమాకైనా బలమైన కథే ప్రాణమని ఇది నిరూపిస్తుంది. సినిమా చివరి అరగంట అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. 128 నిమిషాల ఈ ఎపిసోడ్ చివరిలో వచ్చే మలుపు ప్రేక్షకులను నివ్వెరపరిచింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us