AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Bill: కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా..? జస్ట్ రూ.25 కడితే చాలు.. ఆన్‌లైన్‌లో చాలా ఈజీ..

కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా.. చాలామందికి ఈ ప్రాసెస్ ఎలానో తెలియక దళారులను ఆశ్రయిస్తుంటారు. దళారులకు వేలకు వేలు అప్పగిస్తూ ఉంటారు. అయితే వారికి ఒక్క రూపాయి కూాడా ఇవ్వాల్సిన పని లేదు. మీరు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా సులువుగా మార్చుకోవచ్చు.

Power Bill: కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా..? జస్ట్ రూ.25 కడితే చాలు.. ఆన్‌లైన్‌లో చాలా ఈజీ..
Power Bill
Venkatrao Lella
|

Updated on: Aug 04, 2026 | 5:10 PM

Share

చాలామంది నగరాలు, పట్టణాల్లో శాశ్వతంగా ఇల్లు, ఫ్లాట్ లాంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. కూడబెట్టుకున్న డబ్బులతో కొనుగోలు చేసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అయితే కరెంట్ బిల్లులో ఇంటి లేదా బిల్డింగ్, ఫ్లాట్ యజమాని పేరు ఉంటుంది. శాశ్వతంగా ఇంటిని కొనుగోలు చేసిన సందర్భంలో విద్యుత్ బిల్లులో మీ పేరు లేకపోవడం వల్ల పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్ అనేది మీకు ఉండదు. దీంతో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ పేరుపైకి కరెంట్ బిల్లు మార్చుకోవడం వల్ల మీకు పర్మినెంట్ అడ్రస్ ఫ్రూఫ్ ఉండటంతో పాటు అనేక పనులకు ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎలా మార్చుకోవాలనేది చాలామందికి తెలియక వదిలేస్తుంటారు. కేవలం రూ.25తో సులువుగా కరెంట్ బిల్లులో మీ పేరు వచ్చేలా చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఆన్‌లైన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఏయే డాక్యుమెంట్స్ అవసరం

రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా గిఫ్ట్ డీడ్, ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం, రూ.100 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్‌తో కూడిన ఇండెమ్మిటీ బాండ్, లేటెస్ట్ కరెంట్ బిల్లు, పాస్ పోర్ట్ సైజు ఫొటో అవసరం. వీటిని అన్‌లైన్‌లో పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవడం ఎలా..?

-తెలంగాణలో అయితే https://tgsouthernpower.org/ వెబ్‌సైట్లోకి వెళ్లాలి

-అనంతరం హోమ్ పేజీలో కన్జ్యూమర్ సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-అందులో కన్జూమర్ సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆ తర్వాత కరెంట్ బిల్లుపై ఉండే యూనిక్ సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి

-అక్కడ అడ్రెస్ చేంజ్, టైటిల్ ట్రాన్స్‌ఫర్, కేటగిరీ మార్పు, లైన్లు, అదనపు లోడ్ మార్పు వంటి ఆప్షన్లు కనిపిస్తాయి

-టైటిల్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి

-అప్లికేషన్ ఫారాంలో అవసరమైన వివరాలు నింపి డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి

-అనంతరం రూ.25 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి

-ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది

వీటిని అప్ లోడ్ చేయడం తప్పనిసరి

ఆధార్, పాన్ లాంటి ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం జేపీజీ, పీఈజీ ఫార్మట్‌లో 100కేబీ సైజులోపు అప్‌లోడ్ చేయాలి. ఇక సేల్ డీడ్ 5ఎంబీ లోపు పీడీఎఫ్ ఫార్మట్‌లో అప్‌లోడ్ చేయాలి. వాటిపై మీ సంతకం చేసి అనంతరం స్కాన్ పేపర్లను అప్‌లోడ్ చేయాలి. రూ.100 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్ బాండ్ ఫార్మట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని అదే ఫార్మట్‌లో అప్‌లోడ్ చేయాలి.

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం