ఇటీవల జరిగిన అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలలో ఓ సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఏకంగా 5 అవార్డులు గెలుచుకుంది. ఆ సినిమా మరెదో కాదు.. అనోరా.. ఆస్కార్ వేదికపై ఒకే చిత్రానికి దర్శకుడు సీన్ బేకర్ మొత్తం నాలుగు అవార్డులను గెలుచుకున్నాడు. నిజమే.. (ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకుడు) సహా విభాగాలలో అవార్డులు లభించాయి. దీనితో, ఒకేసారి 4 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న మొదటి దర్శకుడిగా రికార్డు సృష్టించాడు.ఆస్కార్ అవార్డుల వేదికపై అనోరా చిత్రం ఆదిపత్యం చేసింది. ‘ది బ్రూటలిస్ట్’, ‘ది సబ్ స్టాన్స్’, ‘డ్యూన్ పార్ట్ 2’, ‘ఎమిలియా పెరెజ్’ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి ‘అనోరా’ ఉత్తమ చిత్రంగా సెలక్ట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను చూసేందుకు అడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ రెంటింగ్ విధానంలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. సోమవారం నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ఇంగ్లీష్, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. వేశ్యల జీవితాలపై కేంద్రీకృతమైన కథ ఇది. వేశ్యల జీవితాలను, మానసిక పోరాటాలను తెరపై చిత్రీకరించడం ద్వారా ఆస్కార్ అవార్డులను ఏలిన ఈ వేశ్య కథ. ఇక త్వరలోనే సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
కథ విషయానికి వస్తే..
సీన్ బేకర్ దర్శకత్వం వహించిన ‘అనోరా’లో మైకీ మాడిసన్, మార్క్ ఎడెల్జియన్, యురా బోరిసోవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ‘అని’ అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరుగుతుంది. బ్రూక్లిన్‌లో నివసించే అని, తన కెరీర్‌లో భాగంగా ఒకసారి రష్యాకు చెందిన ఒక ధనవంతుడి కుమారుడు వాన్యను కలుస్తుంది. అతను అనితో ప్రేమలో పడి రహస్యంగా ఆమెను వివాహం చేసుకుంటాడు. ధనవంతుడైన అతడు వేశ్యను వివాహం చేసుకోవడం సర్వత్రా కలకలం రేపుతోంది. చివరికి, రష్యాలో నివసించే వాన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. తమ కొడుకు నిర్దోషి అని, ఆమె అబద్ధం చెప్పి అతన్ని పెళ్లి చేసుకుందని వారు ఆమెను తిడతారు. తమ కొడుకును వదిలేస్తే 10,000 డాలర్లు ఇస్తామని ఆఫర్ చేస్తారు. వారి ఆఫర్ నచ్చి అని అతడిని వదిలేస్తుందా ? చివరికి ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది కథ.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..