AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 28 కోట్లతో తీస్తే 235 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మే 30) ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. గురువారం అర్ధరాత్రి నుంచే నాని హిట్-3 ది థర్డ్ కేస్ స్ట్రీమింగ్ అవ్వుతుండగా, ఇప్పుడు మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

OTT Movie: 28 కోట్లతో తీస్తే 235 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: May 30, 2025 | 6:45 AM

Share

ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాని 100 కోట్ల హిట్-3 సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దీనికి కొనసాగింపుగా శుక్రవారం (మే 30) మరిన్ని కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. గత కొన్ని రోజులుగా ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తోన్న ఒక మూవీ కూడా ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదలైన ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా మలయాళంలో ఈ సినిమాకు అయితే భారీ వసూళ్లు దక్కాయి. ఒక్క కేరళలోనే ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. పైగా ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ. 28 కోట్లు మాత్రమే. అంటే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయన్నమాట. గతంలో మలయాళంలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యం మూవీ తరహాలోనే ఈ సినిమాలోని సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అందుకే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినిమా పేరు పేరు తుడరుమ్. మలయాళ సూపర్ స్టార్ మోహనల్ లాల్ ఇందులో హీరోగా నటించాడు. అలనాటి అందాల తార శోభన మరో ప్రధాన పాత్రలో కనిపించింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించిన ఈ సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కువచ్చేసింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మరి థియేటర్లలో ఈ సినిమాస్ మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్