AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: యాక్షన్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన 230 కోట్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. థియేటర్లలో 235 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movies: యాక్షన్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన 230 కోట్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: May 30, 2025 | 9:52 AM

Share

ఈ వారం థియేటర్లలో భైరవం, షష్టి పూర్తి సినిమాలు మాత్రమే థియేటర్లలో కి వచ్చేశాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం మస్ట్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఎందుకంటే ఇప్పటికే నాని హిట్-3 ది థర్డ్ కేస్, మోహన్ లాల్ తుడ్‌రుమ్ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో పాటు ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మేడే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చినా తెలుగులో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీనికి తోడు పోటీగా నిలిచిన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ కు నామమాత్రపు స్పందన వచ్చింది. హీరో, హీరోయిన్ల అభినయం, అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్సులు మాత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే అంతర్లీనంగా ప్రేమ కథ కూడా ఉండడంతో మూవీ లవర్స్ కు ఈ చిత్రం బాగా నచ్చేసింది. తమిళంలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు రెట్రో. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో విలక్షన నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై దకనిపించింది. మలయాళ నటుడు జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా రెట్రో మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణణ్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ సినిమాలు, అలాగే సూర్య మూవీస్ ను ఇష్టపడే వారు రెట్రోపై ఒక లుక్కేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో రెట్రో స్ట్రీమింగ్..

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అడవిని గడగడలాడించే అతిపెద్ద పాము.. ఎంత పెద్ద జంతువైన సెకన్‌లోనే..
అడవిని గడగడలాడించే అతిపెద్ద పాము.. ఎంత పెద్ద జంతువైన సెకన్‌లోనే..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..