
పరమ శివుడు భక్తుడైన భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ఇందులో కన్నప్పగా కనిపించాడు. అలాగే సినిమాలో కీలకమైన రుద్ర పాత్రలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు. వీరితో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎంతో మంది ఈ డివోషనల్ మూవీలో నటించారు. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించారు. జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజైన కన్నప్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో మంచు విష్ణు నటన హైలెట్ గా నిలిచిందన్నారు. అలాగే ప్రభాస్ క్యామియో రోల్ కు కూడా ఆడియెన్స్ చేత విజిల్స్ పడ్డాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా కన్నప్ప సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రపతి భవన్ లోనూ ఈ డివోషనల్ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం.
థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన కన్నప్ప సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంనది తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రన్ కూడా ముగియడంతో త్వరలోనే కన్నప్ప మూవీ ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతుంది. జూలై 25 నుంచి కన్నప్ప చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
🔱 Honoured beyond words! 🙏#Kannappa received a special screening at Rashtrapati Bhavan, a proud recognition of its devotion-driven storytelling and cultural significance.
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#KannappaInCinemas #KannappaMovie #HarHarMahadevॐ@themohanbabu…— Kannappa The Movie (@kannappamovie) July 16, 2025
📽️ A soul-stirring narrative rooted in faith has captivated millions!#Kannappa earns its place as a Divine Blockbuster, celebrated for its emotional intensity and cultural richness. 🔱
🎟️ Book Now: https://t.co/ODH265UkHo
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥… pic.twitter.com/Dj7zBzDZnh— Kannappa The Movie (@kannappamovie) July 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.