Cinema: థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి మలయాళీ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఇటీవల ఓటీటీలో ఎక్కువగా హారర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ అడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇన్నాళ్లు థియేటర్లలో దుమ్మురేపింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్..

సాధారణంగా విభిన్న కంటెంట్ తో తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాలను తెరకెక్కిస్తున్నారు. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ.. ఇలా అనేక జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఓ హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. మలయాళంలో వచ్చిన ఈ ప్యూర్ హారర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మలయాళీ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఎప్పటిలాగే మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..
మలయాళంలో సూపర్ హిట్ అయిన డీయాస్ ఎరే సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. అలాగే తమిళంలోనూ విడుదల చేయనున్నారట.
ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 31న ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి, రామచంద్ర, శశికాంత్ నిర్మించారు. ఆత్మ, ప్రతీకారం అంశాల చుట్టూ సాగుతుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‌లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..
ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..




