
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 25) ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల నటించిన షో టైమ్ సినిమా. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది. దీనికి తోడు నవీన్ చంద్ర ఇటీవల నటించిన బ్లైండ్ స్పాట్, లెవెన్ సినిమాలకు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి షో టైమ్ సినిమా కూడా ఓటీటీలో మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అమ్మాయిల హత్యలు, సైకో కిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదృష్టం పరిక్షించుకునేందుకు రెడీ అవుతోంది. హిందీలో సర్జామీన్ కూడ చూడదగ్గ సినిమాలే. మరి ఈ వారాంతంలో ఏయే ఓటీటీలో ఏయే సినిమాలున్నాయో ఒకసారి స్ట్రీమింగ్ లిస్ట్ చూద్దాం రండి.
The scariest crimes aren’t planned… they’re accidental. 💥
ఇవి కూడా చదవండిDive into Show Time, a gripping psychological thriller.
Showtime – Streaming from tomorrow on SunNXT#ShowTime #SunNXT #TeluguMovies #CrimeThriller #MurderMystery #NewRelease #SuspenseDrama #NaveenChandra… pic.twitter.com/XiMNiFMrBn
— SUN NXT (@sunnxt) July 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.