Ranga Marthanda: కృష్ణవంశీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఆ నిర్ణయం తీసుకుంటారా.?

Ranga Marthanda: క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ నుంచి కొత్త సినిమా రాక చాలా ఏళ్లు అవుతోంది. 2017లో వచ్చిన 'నక్షత్రం' తర్వాత మళ్లీ ఇంకో సినిమాను..

Ranga Marthanda: కృష్ణవంశీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఆ నిర్ణయం తీసుకుంటారా.?
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 22, 2021 | 7:27 AM

Ranga Marthanda: క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ నుంచి కొత్త సినిమా రాక చాలా ఏళ్లు అవుతోంది. 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత మళ్లీ ఇంకో సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేయలేదు. సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న కృష్ణ వంశీ రంగ మార్తాండ పేరుతో ఓ సినిమాను పట్టాలెక్కించారు. అంచనాలకు తగ్గట్లుగానే మరాఠలో సూపర్‌ హిట్‌ అయిన నటసామ్రాట్‌ చిత్రాన్ని తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇక ఇందులో ప్రకాష్‌ రాజ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా రామ్యకృష్ణతో పాటు పలువురు స్టార్‌ యాక్టర్స్‌ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమై చాలా కాలం అవుతోన్న ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అయితే కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్‌ వాయిదా పడితే తాజాగా కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారనేది సదరు వార్త సారంశం.

థియేటర్లు పూర్తి స్థాయిలో నడవకపోవడం, ప్రేక్షకులకు కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించని కారణంగా కృష్ణ వంశీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కృష్ణ వంశీ ఓటీటీలోనే విడుదలకు ఒప్పుకుంటారా.? లేదా థియేటర్‌లోనే విడుదల చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Also Read: Hero Kartikeya: స్టైల్ మార్చిన యంగ్ హీరో.. ఈ సారి అదరగొట్టే ప్లానే వేశాడుగా.. కార్తికేయ న్యూ ఫొటోస్…

క్యూట్‏గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోయిన్‏కు క్రేజ్ ఎక్కువే..

Ali Reza: తండ్రి కాబోతున్న తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్.. ఆనందంలో చిందులేసిన అలీ రెజా ఫొటోస్…