Kothapallilo Okappudu: ఆహా ఓటీటీలో సరికొత్త కామెడీ డ్రామా.. కొత్తపల్లిలో ఒకప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
నిత్యం డిఫరెంట్ కథలతో సినీ ప్రియులను అలరిస్తుంది ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్. ఇక ఇప్పుడు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేందుకు సరికొత్త కామెడీ డ్రామాను తీసుకువస్తుంది. అదే కొత్తపల్లిలో ఒకప్పుడు. గతంలో సూపర్ హిట్ అయిన కేరాఫ్ కంచెరపాలెం సినిమా నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కేరాఫ్ కంచరపాలెం ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిన సూపర్ హిట్ చిత్రం. ఈ సినిమాతోపాటు ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య వంటి విభిన్న కంటెంట్ చిత్రాలను నిర్మించి జనాలకు దగ్గరయ్యారు నిర్మాత డాక్టర్ ప్రవీణ. ఇక ఇప్పుడు నిర్మాతగా కాకుండా దర్శకురాలిగా మారి చేసిన కొత్త సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందించిన ఈచిత్రం జూలై 18న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి రాబోతుంది. ఆగస్ట్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ఇదివరకే ప్రకటించింది. అయితే “ఆహా గోల్డ్ ” సబ్స్క్రిప్షన్ ఉంటే 24 గంటల ముందే ఈ సినిమాను చూడొచ్చని తాజాగా ఆహా ఓటీటీ వెల్లడించింది. “కొత్తపల్లి పిలుస్తోంది” అంటూ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇవి కూడా చదవండి: Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఈ సినిమాకు హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించగా.. మనోజ్ చంద్ర, మౌనిక కీలకపాత్రలు పోషించారు. నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలను సినీప్రియులకు అందించే ఆహా.. ఇప్పుడు తెలుగులో మంచి టాక్ అందుకున్న కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాతో మరోసారి మూవీ లవర్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇవి కూడా చదవండి: Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
కథ విషయానికి వస్తే..
కొత్తపల్లి అనే గ్రామంలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తుంటాడు. ఇక అతడి వద్దే రామకృష్ణ (మనోజ్ చంద్ర) సహాయకుడిగా పనిచేస్తుంటాడు. ఇదే ఊరిలో ఉండే రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి(మౌనిక)ను రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటారు. రామకృష్ణకు రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియో ఉంటుంది. మౌనికకు తన ప్రేమ విషయం చెప్పేందుకు సావిత్రి స్నేహితురాలైన అందం అలియాస్ ఆదిలక్ష్మి (ఉషా బోనెల) సాయం తీసుకుంటాడు. కానీ అనుహ్యంగా రామకృష్ణ, ఆదిలక్ష్మి ప్రేమించుకుంటున్నారని.. ఇద్దరికి పెళ్లి చేయాలని పంచాయతీ తీర్మానం చేస్తుంది. ఆ తర్వాత రామకృష్ణ ఏం చేశాడు.. ? అప్పులు ఇస్తూ వడ్డీలు వసూలు చేస్తున్న అప్పన్న ఊరందరికీ దేవుడు ఎలా అయ్యాడు ? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి: Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
ఆహా ట్వీట్..
Kothapalli పిలుస్తోంది! 🎬
Watch #KothapalliloOkappudu Premieres 22nd Aug only on #aha(24hrs early access for Gold users)@RanaDaggubati @IamPraveenaP @SpiritMediaIN#KothapalliloOkappudu #RanaDaggubati #PraveenaParuchuri pic.twitter.com/IO08xuWGba
— ahavideoin (@ahavideoIN) August 8, 2025
ఇవి కూడా చదవండి: Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?








