AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఈసారి గట్టిగానే.. బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా?

బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 9 కోసం నాగ్ రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Bigg Boss Telugu 9: ఈసారి గట్టిగానే.. బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా?
Akkineni Nagarjuna
Basha Shek
|

Updated on: Aug 08, 2025 | 1:21 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ తెలుగు నయా సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. గత 6 సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అక్కినేని నాగార్జుననే ఈ సారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం అక్కినేని నాగార్జున ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2వ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు కింగ్ నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషకం లభిస్తోంది. ఇక విజేతలకు అయితే దాదాపు అర కోటి ప్రైజ్ మనీ లభిస్తుది. అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి. మరి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా ఏటా బిగ్ బాస్ సీజన్ కోసం సుమారు మూడు నెలల సమయాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలోనే హోస్టులకు భారీగా రెమ్యునరేషన్ లభిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 9వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లలోనూ దాదాపు ఇంచుమించుగా ఇదే రెమ్యూనరేషన్ నాగ్ అందుకున్నారట.

ఇవి కూడా చదవండి

కాగా గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లో మరిన్ని హంగులు, సర్ ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు హౌస్ లోకి రాబోయే కంటిస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తోంది. టాస్కుల పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తోందట. అలాగే సీక్రెట్ రూమ్, రీ ఎంట్రీ వంటి పాత కాన్సెప్టులను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్కులు ప్రవేశ పెట్టాలని చూస్తున్నారట.

బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.