తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఆరగన్. మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్, శ్రీరంజని కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు అరుణ్ కేఆర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ డైరెక్షన్ అంతగా కొత్తగా లేకపోవడంతో ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతోపాటు మైఖేల్, కవి ప్రియ కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఐఎమ్ డీబీలో ఆరగన్ సినిమాకు 8.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.
తమిళ్ మూవీ ఆరగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. హారర్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 3 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగులో వస్తుందా అనేది క్లారిటీ రాలేదు. తమిళ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.
కథ విషయానికి వస్తే..
ఓ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు అరుణ్ కేఆఱ్ ఆరగన్ మూవీని తెరకెక్కించాడు. శరవణన్ (మైఖేల్ తంగదురై), మాగిజిని (కవిప్రియ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హిట్ స్టేషన్ లో శరవణన్ కు జాబ్ వస్తుంది. దీంతో ఉద్యోగం నిమిత్తం అక్కడకు వెళ్లిన జంటకు అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అవేమిటీ.. ? అక్కడ ఇద్దరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటీ ? అనేది సినిమా. జనవరి 3 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.