
ఇటీవల కాలంలో ఓటీటీలో మిస్టరీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ, కిల్లర్ జానర్ చిత్రాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అదే జానర్. హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గాడ్. 2023 అక్టోబర్ 6న తెలుగులో విడుదలైంది. తమిళంలో వచ్చిన ఇరైవన్ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించగా..థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఈ చిత్రంలో నయనతార, జయం రవి, రాహుల్ బోస్, నరైన్ కీలకపాత్రలు పోషించగా.. సుధన్ సుందరం, జయరాం జి.లు పాషన్ స్టూడియోస్ పై నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
అర్జున్ (జయం రవి ) అనే డీసీపీ, నేరస్తులను తనదైన స్టైల్లో శిక్షించే డైనమిక్ పోలీస్ అధికారి. అతడి స్నేహితుడు ఆండ్రూ సైతం పోలీసే. బ్రహ్మా అనే సైకో కిల్లర్ నగరంలోని 25 ఏళ్ల అమ్మాయిలను దారుణంగా హత్య చేస్తుంటాడు. వారి శవాల వద్ద స్మైలీ గుర్తులను వదిలి వెళ్తుంటాడు. ఈ కేసు విచారణలో తన ప్రియురాలు నయనతారతో కలిసి ఆ సైకో కిల్లర్ ను పట్టుకుంటాడు. అయితే అతడు ఆండ్రూను చంపేసి పారిపోతాడు. దీంతో అర్జున్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కొన్నాళ్లకు నగరంలో మళ్లీ హత్య చేస్తుంటాడు. దీంతో రంగంలోకి దిగిన అర్జున్ ఆ సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు.. ? అసలు ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..