OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Oct 11, 2024 | 3:17 PM

జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్, JA ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా  నిర్మించిన చిత్రం ‘వేద’. ఇందులో  జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?
Vedaa Movie
Follow us on

జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్, JA ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా  నిర్మించిన చిత్రం ‘వేద’. ఇందులో  జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 10న ‘వేద, సంవిధాన్ కా రక్షక్’ డిజిటల్ ప్రీమియర్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ‘వేద’ సమాజంలోని దళిత, కుల వివక్షల మీద ఈ చిత్రాన్ని తీశారు. ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 10 నుంచి ZEE5లో ‘వేద, సంవిధాన్ కా రక్షక్’ స్ట్రీమింగ్ అవుతోంది. వేద సంవిధాన్ క రక్షక్ హిందీ, తమిళం, తెలుగులో అక్టోబర్ 10 నుండి ZEE5లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలో ZEE5 ఇండియాలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ.. ‘ZEE5లో వేద చిత్రం వచ్చేసింది. సామాజిక అసమానతలు, కుల వివక్ష మీద చేసే పోరాటంగా వేద చిత్రాన్ని తెరకెక్కించారు. ZEE5లో ఈ చిత్రం వస్తుండటం మాకు గర్వంగా ఉంది. సామాజిక సందేశాన్నిస్తూ, అర్థవంతమైన సంభాషణలతో వచ్చిన ‘వేద’తో మా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘వేద ఇప్పుడు ZEE5లోకి వచ్చింది. ఈ శక్తిమంతమైన కథనం మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ మూవీలోని సోషల్ మెసెజ్ మరింతగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి’ అని అన్నారు. ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత మధు భోజ్వానీ మాట్లాడుతూ.. ‘ ‘వేద’ను డిజిటల్ ప్రీమియర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. ఓ స్ఫూర్తినిచ్చే, శక్తినిచ్చే కథను చెప్పాలని ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. డిజిటల్ విడుదల ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. ‘అర్థవంతమైన సంభాషణలతో, మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించాలనే వేదను తీశాం. ఈ మూవీ వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఆలోచనలు రేకెత్తించేలా ఉంటుంది. Zee5లో సినిమా విడుదల చేయడం ద్వారా ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యామ’ని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక హీరో జాన్ అబ్రహం మాట్లాడుతూ.. ‘ వేద లాంటి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. వేద స్త్రీ శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. పైగా సందర్భోచితమైనది. ఇది మహిళలు అభివృద్ధి చెందినప్పుడే.. సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పే చిత్రం. ZEE5 ప్రేక్షకులు వేదలో ఈ పరివర్తన సందేశాన్ని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నటుడు శర్వరి మాట్లాడుతూ..‘ZEE5లో ‘వేద’ డిజిటల్ విడుదలైంది. వేదలో నటించడం మరిచిపోలేని అనుభవం. వేదపై ఇంత ప్రేమ, ప్రశంసలు లభించడం చాలా గొప్ప విషయం, వేద స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి