జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను అందిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించాడు రాకింగ్ రాకేష్. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నైజాం ఏరియాలో మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో రాకేష్ భార్య జోర్దార్ సుజాత, మైమ్ మధు, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో అటు హీరోగా.. ఇటు నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు రాకింగ్ రాకేష్.
ఇదిలా ఉంటే.. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీరాభిమాని అయిన ఓ లంబాడీ యువకుడి జర్నీతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో అడియన్స్ ముందుకు వచ్చింది.
కథ విషయానికి వస్తే..
వరంగల్ జిల్లాలోని రంగబాయి తండాకు చెందిన కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్) ఓ లంబాడీ యువకుడు. కేసీఆర్ కు వీరాభిమాని. తండావాసులంతా అతడిని కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ప్రేమిస్తుంది. తన బావనే పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. కానీ తన మరదలిని కాకుండా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు కేశవ. ఇక తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని నిర్ణయించుకుంటాడు. కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ చేరుకున్న కేశవ .. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. ? తన ఊర్లో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాడు ? చివరకు అనన్యను పెళ్లి చేసుకున్నాడా ? అనేది కథ.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.