AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సముద్రంలో తిష్టవేసిన జాంబీలు.. ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ .. అధికారిక ప్రకటన

జాంబీస్.. సినీ ఆడియెన్స్ బాగా ఇష్టపడే మూవీ జానర్లలో ఇది కూడా ఒకటి. హాలీవుడ్ లో తరచూ ఇలాంటి సినిమాలు రిలీజవుతుంటాయి. తాజాగా ఇదే జాంబీల కథతో తెలుగులో ఒక సినిమా వచ్చింది. థియేటర్లలో బాగా ఆడిన ఆ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

OTT Movie: సముద్రంలో తిష్టవేసిన జాంబీలు.. ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ .. అధికారిక ప్రకటన
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 03, 2025 | 7:35 PM

Share

కోలీవుడ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్ర‌కాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కింగ్ స్టన్. క‌మ‌ల్ ప్ర‌కాష్ తెరెకెక్కించిన ఈ సినిమాలో దివ్య భారతి కథానాయికగా నటించింది. కాగా మన దేశంలో తెరకెక్కిన మొదటి సీ అడ్వెంచర్ ఫాంటసీ మూవీ ‘కింగ్ స్టన్’ కావడం విశేషం. రిలీజ్ కు ముందే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే మార్చి 07న మార్చి 7న థియేటర్లలో విడుదలైన కింగ్ స్టన్ జనాలను ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండడంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. అయితే లాంగ్ రన్ మాత్రం కొనసాగించలేకపోయింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన కింగ్ స్టన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కింగ్ స్టన్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. కాగా ఈ మూవీ ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ప్రసారం చేయనున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్‌ హిట్‌గా నిలిచిన తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం తరహాలోనే ఓకేసారి ఓటీటీతో పాటు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కింగ్‌స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీవీల్లో కేవలం జీ తమిళం ఛానెల్లో మాత్రమే ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.

కింగ్ స్టన్ సినిమాను ప్యార్లల్ యూనివర్సల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ పతాకాలపై జీవీ ప్రకాశ్ కుమార్, భవానీ శ్రీ, ఉమేశ్ కేఆర్ భన్సల్ నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు అందించాడు.

ఇవి కూడా చదవండి

ఇక కింగ్ స్టన్ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక సీ అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ సినిమా. జీవీ ప్రకాశ్ కుమార్ నివసించే తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. దీంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. అదే సమయంలో హీరో సముద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరి అసలు ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్‌స్టన్‌ సినిమా చూడాల్సిందే.

జీ5లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!