Viswam OTT: అప్పుడే ఓటీటీలోకి గోపిచంద్ ‘విశ్వం’! ఆ పండగ రోజే స్ట్రీమింగ్! ఎక్కడంటే?
గోపీచంద్, శ్రీను వైట్ల గత సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాంటిది ఈ రేర్ కాంబినేషన్ లో వచ్చిన విశ్వం సినిమా ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. శ్రీను వైట్ల తరహా మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలు, కావ్యా థాపర్ అందాలు విశ్వం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. దసరా పండగ కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ మూవీ అని నెగెటివ్ కామెంట్స్ వినిపించినా, శ్రీను వైట్ల మార్క్ తరహా కామెడీ మళ్లీ వర్కవుట్ అయ్యింది. దీనికి తోడు దసరా సెలవులు గోపీచంద్ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఈ కారణంగానే విశ్వం సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. గోపీచంద్, శ్రీను వైట్లకు కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ మూవీ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో దీపావళీ కానుకగా అక్టోబర్ 29న విశ్వం సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 29న కుదరకపోతే నవంబర్ 3 అయినా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.
చిత్రాలయ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై వేణు దోణెపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిచొట్ల విశ్వం సినిమాను నిర్మించారు. జిషు సేన్‌గుప్తా, నరేష్, వీటీవీ గణేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, చమ్మక్ చంద్ర, పృథ్వీ రాజ్, అజయ్ ఘోష్, శకలక శంకర్, మాస్టర్ భరత్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ అందించిన స్వరాలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అలాగే గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను బాగా అలరించాయి.
Team #Viswam received a warm welcome and love from fans at Apsara Theatre, Vijayawada, as part of blockbuster success tour 🤩🤩
Thanks to audience for making this Dussehra special with your amazing response to #Viswam 💥💥
Book Your Tickets for #DussehraBlockbusterViswam Now ✨… pic.twitter.com/fkAEkWFI7u
— People Media Factory (@peoplemediafcy) October 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.