Raayan OTT: రెండు ఓటీటీల్లోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ.. రాయన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Aug 11, 2024 | 10:12 PM

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు

Raayan OTT: రెండు ఓటీటీల్లోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ.. రాయన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Dhanush Raayan Movie
Follow us on

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా ‘రాయన్’. ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. భారీ అంచనాల మధ్య జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ లో ఈ సినిమాకు ఇప్పటికే వంద కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోన్న రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ధనుష్ రాయన మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయని టాక్. ఈ నేపథ్యంలో ఆగస్టు 30 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమచారం. దీని గురించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

రాయన్ సినిమాలో ధనుష్ చెల్లెలు దుర్గగా దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. అలాగే కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు.. తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక రాయన్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు ధనుష్. ఇందులో అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించనుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఇది వరకే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.