Paarijatha Parvam OTT: ఆహాలో లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ‘పారిజాత పర్వం’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

30 వెడ్స్ 20' వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ నటుడు చైతన్య రావు. ఆ తర్వాత 'కీడా కోలా', 'షరతులు వర్తిస్తాయి' సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘పారిజాత పర్వం’. 'కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌' అన్నది ఉప శీర్షిక.

Paarijatha Parvam OTT: ఆహాలో లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. 'పారిజాత పర్వం' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Paarijatha Parvam Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 09, 2024 | 2:44 PM

’30 వెడ్స్ 20′ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ నటుడు చైతన్య రావు. ఆ తర్వాత ‘కీడా కోలా’, ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌’ అన్నది ఉప శీర్షిక. చైతన్య రావు సరసన మాళవిక సతీశన్ హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ శ్రద్ధాస్, కమెడియన్ సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. కిడ్నాప్ నేపథ్యానికి కాస్త క్రైమ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి పారిజాత పర్వం సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సంతోష్‌ కంభంపాటి. ముఖ్యంగా సినిమాలో సునీల్, హర్ష కామెడీ బాగా వర్కవుట్ అయిందని రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన పారిజాత పర్వం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 12 నుంచి పారిజాత పర్వం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ఈ మేరకు ‘కామెడీ థ్రిల్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి’ అనే క్యాప్షన్ తో పారిజాత పర్వం సినిమా పోస్టర్ ను కూడా పంచుకుంది.

ఇవి కూడా చదవండి

వనమాలి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ సంయుక్తంగా పారిజాత పర్వం సినిమాను నిర్మించారు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. కిడ్నాప్ చేయడం ఓ కళ అన్న ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే కిడ్నాప్ నేపథ్యంలో సాగుతుంది పారిజాత పర్వం సినిమా. మరి థియేటర్లలో ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని మిస్ అయ్యారా? అయితే జస్ట్ ఒక రెండు రోజులు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఇంట్లోనే చూడొచ్చు.

జూన్ 12 నుంచి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.