Bigg Boss OTT: బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌గా దివ్య అగర్వాల్.. అసలు ఈ బిగ్‌బాస్ ఓటీటీ ఏంటీ? ఎవరీ దివ్య.?
Bigg Boss OTT: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రియాలిటీ షో బిగ్‌బాస్. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా నిర్వాహకులు కూడా రియాలిటీ షోలో మార్పులు..
Bigg Boss OTT: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రియాలిటీ షో బిగ్‌బాస్. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా నిర్వాహకులు కూడా రియాలిటీ షోలో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ మార్కెట్ పెరగడంతో హిందీ బిగ్‌బాస్ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ ఓటీటీ పేరుతో మిని బిగ్‌బాస్‌ను నిర్వహించారు.
ఇదిలా ఉంటే హిందీలో ఇప్పటి వరకు 14 సీజన్‌లు పూర్తయిన విషయం తెలిసిందే. 15వ సీజన్ ప్రారంభానికి ముందు ఓటీటీ వేదికగా ప్రయోగాత్మకంగా బిగ్‌బాస్ ఓటీటీని నిర్వహించారు. ఈ షోకు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యహరించారు. తాజాగా శనివారం ఈ ఓటీటీ బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు.
ట్రోఫీ కొట్టేసిన దివ్య..
తొలిసారి జరిగిన ఈ బిగ్‌బాస్ ఓటీటీ ట్రోఫీని దివ్య అగర్వాల్ సొంతం చేసుకున్నారు. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్ బాపత్, ప్రతీక్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇక దివ్య అగర్వాల్ విషయానికొస్తే.. ఆమె నటి, డ్యాన్సర్. ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా 10వ సీజన్‌తో దివ్య తొలిసారి అందరికీ పరిచయమయ్యారు.
ఈ సీజన్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచారు. ఇక దివ్య ద ఫైనల్ ఎగ్జిట్ అనే సినిమాలోనూ నటించారు. గతంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక శర్మతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంతో ఆమె మరింత హైలైట్ అయ్యారు. మరి ఓటీటీ షోలో ట్రోఫీ సొంతం చేసుకున్న దివ్యకు బిగ్‌బాస్ 15వ సీజన్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి.