Funny Video: గాఢ నిద్రలోంచి సడెన్‌గా లేచిన చిన్నోడు.. ఆ తరువాత వాడు చేసిన పనికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు..

Funny Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా సర్క్యూలేట్ అవుతుంటాయి.

Funny Video: గాఢ నిద్రలోంచి సడెన్‌గా లేచిన చిన్నోడు.. ఆ తరువాత వాడు చేసిన పనికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు..
Child
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2021 | 11:00 PM

Funny Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా సర్క్యూలేట్ అవుతుంటాయి. అందులోనూ పిల్లల వీడియోలు అయితే ఎంతగానో ఆకట్టుకుంటాయి. పిల్లలు ఏం చేసినా చుడముట్టగా, ఫన్నీగా ఉంటాయి. వారి చర్యలు అందరి హృదయాలను ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఆ వీడియోలో ఉన్న బుడ్డోని అమాయకత్వానికి ముగ్దులైపోతున్నారు. కారణం.. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న పిల్లాడు.. ఒక్కసారిగా లేచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అది చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

ఇంతకీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే.. కారులో వెనుక సీటులో ఓ చిన్న అబ్బాయి గాఢంగా నిద్రపోతున్నాడు. మరోవైపు కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మ్యూజిక్ ఆన్ చేశాడు. ఆ సౌండ్‌కు ఒక్కసారిగా లేచిన చిన్నోడు.. లేవడం లేవడంతోనే కాళ్లు, చేతులు ఆడిస్తూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. కూర్చున్న చోటనే చిందులేయడం మొదలుపెట్టాడు. కారులో ఉన్న వ్యక్తులు ఆ చిన్నోడి ఫర్ఫార్మెన్స్‌ను చూసి తెగ నవ్వుకున్నారు. అయితే, ఈ సీన్‌ను అంతా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్నోడి ఫర్ఫార్మెన్స్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు. ఆ వీడియోకు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘పిల్లాడి చర్య అద్భుతంగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చిన్నోడు ఎంత ముద్దుగొలుపుతున్నాడో అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని ఇంకొందరు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరు చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తూ.. ముద్దులొలికే చిన్నోడి ప్రవర్తనకు మంత్రుముగ్దులు అయిపోతున్నారు. కాగా, ఈ క్యూట్ వీడియోను టిక్‌టాక్ ఫన్నీ వైరల్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది వ్యూస్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Fire Accident: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు.. రూ. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం..

Srisailam Dam: శ్రీశైలానికి జలకళ.. నిండుకుండల్లా తెలుగు ప్రాజెక్టులు.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు(వీడియో)

Bigg Boss 5 Telugu: అంబరాన్ని తాకిన యాంకర్‌ రవి పుట్టిన రోజు వేడుకలు.. హౌజ్‌ బయట రచ్చ చేసిన ఫ్యామిలీ మెంబర్స్‌..

దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన