బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో బుల్లితెర నటుడు అర్జున్ అంబటి కూడా ఒకడు. ఏడో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అతను బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోయినా తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలు, సీరియల్స్ తో బిజీగా మారిపోయాడు. అలాగే కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అలా అర్జున్ అంబటి నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోల్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో చైతన్య రావు మరో కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 19న చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన తెప్ప సముద్రం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు కూడా చేయకపోవడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో నిలవలేకపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా థియేటర్లలో రిలీజైన మూడు నెలలకు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తెప్ప సముద్రం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. రెండు రోజుల క్రితమే సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరించింది. అందుకు తగ్గట్టుగానే శనివారం (ఆగస్టు 03) అర్ధ రాత్రి నుంచే తెప్ప సముద్రం సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది ఆహా.
శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించిన తెప్ప సముద్రం సినిమాలో ఆదర్శ్, కిషోరి ధాత్రక్, రవిశంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పెద్దపల్లి రోహిత్ స్వరాలు సమకూర్చారు. శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, సాయి బాబా తలారి ఎడిటర్ గా వ్యవహరించారు. ఇక తెప్ప సముద్రం సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని ‘తెప్ప సముద్రం’ అనే ఊరిలో ఈ కథంతా సాగుతుంది. ఆ గ్రామంలో స్కూల్ పిల్లలు వరుసగా మాయమవుతుంటారు. దీనికి కారణం కనుక్కోవడానికి ఎస్సై గణేశ్ (చైతన్య రావు) వస్తాడు. మరోవైపు రిపోర్టర్ ఇందు, ఈమె ప్రియుడు ఆటో డ్రైవర్ విజయ్ ( అర్జున్ అం బటి) కూడా పిల్లల కోసం వెతుకుంటారు. అలా గంజాయి దందాతో పిల్లల మిస్సింగ్‌కి సంబంధం ఉందని ఎస్సై తెలుకుంటాడు. మరి చివరకు ఏమైందనన్నదే తెప్ప సముద్రం సినిమా స్టోరీ. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి తెప్ప సముద్రం ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
Will truth rise to the surface or will deception drown it? Watch Theppa Samudram to find out#TheppaSamudram Movie STREAM NOW on @ahavideoin
LINK : https://t.co/L60Iqcs157
Digital Distribution by @bhavanihdmovies@arjunambati_ @IamChaitanyarao @sathishkumarrap @Teju_Pro… pic.twitter.com/qK87X0PY4Z
— Teju PRO (@Teju_PRO) August 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.