OTT Movie: కన్‌స్ట్రక్షన్ బిల్డింగులో శవాలు.. ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడకండి

కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది . ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇవ్వడంతో పాటు భయ పెట్టింది. ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: కన్‌స్ట్రక్షన్ బిల్డింగులో శవాలు.. ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడకండి
OTT Movie

Updated on: Sep 02, 2025 | 8:49 PM

ఎప్పటిలాగే గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. ఈ ఏడాది మార్చిలో ఈ తమిళ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. క్షణం క్షణం ఉత్కంఠ పెంచే హారర్‌ ఎలిమెంట్స్‌తో కోలీవుడ్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించింది. అయితే విడుదలైన మూడు నెలలకు ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. కానీ ఇండియన్‌ సినిమా ఫ్యాన్స్‌కి మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఈ క్రమంలో 5 నెలల తర్వాత ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పుడు ఇండియన్ మూవీ ఫ్యాన్స్ కు కూడా ఈ మూవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒంటరి, మహాత్మ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన మలయాళ నటి భావన ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మిత్ర (భావన) ఓ ఆర్కిటెక్ట్. తన పనిలో భాగంగా ఓ కన్ స్ట్రక్షన్ సైట్ కు వెళ్తుంది మిత్ర. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆమెకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొత్త కొత్త మనుషులు కనిపిస్తారు. ఆ బిల్డింగులో కొన్ని శవాలను కూడా చూస్తుంది. అలాగే ఆత్మలు కూడా కనిపిస్తాయి. దీంతో ఆ బిల్డింగ్ లో ఏదో సూపర్ నేచురల్ పవర్ ఉందని ఆమెకు అనిపిస్తుంది.

ఇదే సమయంలో తన తండ్రి గతంలోని చీకటి రహస్యాలను మిత్ర తెలుసుకోవడంతో కథలో అసలు ట్విస్ట్‌ మొదలవుతుంది. భూమి కబ్జా కేసులు, అవినీతి, హత్యల చుట్టూ తిరిగే ఈ మూవీ ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. మరి ఆ బిల్డింగ్ లో ఉన్న శవాలు ఎవరివి? ఆ ఆత్మల వెనక ఉన్నమిస్టరీ ఏంటి? ఆఖరుకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు ది డోర్. భావనతో పాటు గణేష్ వెంకట్రామన్, ప్రియా వెంకట్, జయప్రకాష్, శ్రీరంజిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భావన బ్రదర్ జైదేవ్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ఆగస్టు 29నే ఓటీటీ రిలీజైంది. ప్రస్తుతం ఆహా తమిళ్ లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడైతే తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష సబ్ టైటిల్స్ ఉన్నాయి. త్వరలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.